అశ్లీల వెబ్ సైట్‌లో పిల్లలకు లెక్కల పాఠాలు
అశ్లీల వెబ్ సైట్లపై నిషేధం ఉన్నా వాటిని భారతదేశంలో యథేచ్ఛగా వీక్షించేవారి సంఖ్య అసాధారణంగా ఉంది.
అశ్లీ*ల వెబ్ సైట్లపై నిషేధం ఉన్నా వాటిని భారతదేశంలో యథేచ్ఛగా వీక్షించేవారి సంఖ్య అసాధారణంగా ఉంది. ముఖ్యంగా యువతరం పిల్లలు ఈ వెబ్ సైట్లకు అంకితమవుతున్నారనేది సర్వేల హెచ్చరిక. అయితే ఇలాంటి వేదికలపై మ్యాథ్స్ ట్యూషన్ పేరుతో పిల్లలను తప్పు దారి పట్టించడం భయపెడుతోంది. పో*ర్న్ చూసేవాళ్లే కాదు.. పిల్లలు, యువతరం ఈ మ్యాథ్స్ ట్యూటర్ల టార్గెట్. మొదట ఎఫ్.బి, ఇన్ స్టా అంటారు. ఆ తర్వాత ఓన్లీ ఫ్యాన్స్ అంటూ క్రియేటివిటీ చూపిస్తారు. దానికంటూ గ్రూపులు క్రియేట్ అవుతుంటాయి. చివరికి అశ్లీ*ల వెబ్ సైట్లకు తీసుకుని వెళ్లి, డోపమైన ఫీడ్ బ్యాక్ లూప్ సిస్టమ్ తో తమకు కావాల్సిన విధంగా వాడుకుంటారు.
అశ్లీ*ల వెబ్ సైట్‌లో మ్యాథ్స్ ట్యూటోరియల్ నడిపించి 2 కోట్లు సంపాదించిన తైవానీ కథ ఇటీవల ఆశ్చర్యం కలిగించింఇ. చాంగ్ హ్సు అనే తైవాన్‌కు చెందిన మ్యాథ్స్ టీచర్ అసాధారణ పద్ధతులు ఆన్‌లైన్ కోర్స్ తీరు తెన్నులను మార్చేసిందని సర్వేలో తేలింది. రద్దీగా ఉండే ఆన్‌లైన్ ట్యూటరింగ్ మార్కెట్‌లోని పోటీ నుండి తనను తాను వేరు చేసుకోవడానికి హ్సు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. అశ్లీల కంటెంట్ తో పాపులరైన వెబ్‌సైట్ `పో*ర్న్‌హబ్`లో తన మ్యాథమెటిక్స్ తరగతుల వీడియోలను పోస్ట్ చేసి అతడు భారీగా ఆర్జిస్తున్నాడు. అతని క్లిక్ బైట్ విధానం వర్కవుటైంది. దాదాపు 3 మిలియన్ల వీక్షణలు, 13,000 కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లు అతడికి దక్కారు.
ఇది అతని ప్రీమియం కోర్సులకు ట్రాఫిక్‌ను పెంచింది. అతడికి ఏటా ఆశ్చర్యకరంగా 270,000 డాలర్లు (రూ. 2,26,76,719) సంపాదనను ఈ విధానం ఇచ్చింది. న్యూయార్క్ పోస్ట్ వివరాల ప్రకారం.. చాంగ్ హ్సు మాస్టర్స్ డిగ్రీతో అనుభవజ్ఞుడైన గణిత బోధకుడు. ఈ రంగంలో అతనికి 15 సంవత్సరాల అనుభవం కూడా ఉంది. ప్రారంభంలో అతను తన మ్యాథ్స్ పాఠాలను యూట్యూబ్‌లో పోస్ట్ చేసేవాడు. కానీ తరువాత దానికంటే ఉత్తమ మార్గం ఏం ఉందో వెతికాడు. ఎవరూ ఊహించని చోట తన బోధనను ప్రదర్శించడానికి ఒక వినూత్న మార్కెటింగ్ వ్యూహాన్ని ఎంచుకున్నాడు. మే 2020లో అతడు తన కాలిక్యులస్ పాఠాలను పోర్న్‌హబ్‌కు అప్‌లోడ్ చేయడం ప్రారంభించాడు.
పో*ర్న్‌హబ్‌లో అతని ఉచిత తరగతులను కనుగొన్న అనేక మంది విద్యార్థులు అతడి పెయిడ్ కోర్సులలో చేరారు. తైవానీ టీచర్ అసాధారణ వ్యూహం గొప్పగా వర్కవుటైంది. చాలా తక్కువ మంది మాత్రమే వయోజన వీడియో ప్లాట్‌ఫామ్‌లలో గణితాన్ని బోధిస్తారు. వాటిలో వీడియోలను చూసే వారు చాలా మంది ఉన్నారు కాబట్టి, నేను అక్కడ నా వీడియోలను అప్‌లోడ్ చేస్తే, చాలా మంది వాటిని చూస్తారని నేను అనుకున్నాను అని ఉపాధ్యాయుడు తన సాంప్రదాయేతర టెక్నిక్ గురించి చెప్పాడు. అతడి మ్యాత్స్ క్లాస్ వీడియోలు సాధారణంగా నలభై నిమిషాలు నడుస్తాయి. ఒక్కొక్కటి ఇరవై వేల వీక్షణలను పొందుతాయి. అయితే ఉపాధ్యాయుడి ప్రకారం.. అతడి ప్రేక్షకులలో 60 శాతం కంటే ఎక్కువ మంది కష్టమైన గణిత భావనలను అర్థం చేసుకోవాలనే ఆకాంక్షతో కాకుండా వినోదం కోసం చూస్తారు. కానీ ఆ విధంగా అక్కడ నేర్చుకుంటున్నారు.