రోడ్డుపై ప్రైవేటు బస్సు జెట్ స్పీడ్.. డ్రైవర్ కు షాకిచ్చిన సినీ దర్శకుడు

సామాజిక బాధ్యతతో వ్యవహరించే ప్రముఖులు కొందరు ఉంటారు. అలాంటి వారు సవాళ్లు.. సమస్యల్ని పట్టించుకోకుండా పోరాటం చేస్తూంటారు.

Update: 2024-08-14 05:08 GMT

సామాజిక బాధ్యతతో వ్యవహరించే ప్రముఖులు కొందరు ఉంటారు. అలాంటి వారు సవాళ్లు.. సమస్యల్ని పట్టించుకోకుండా పోరాటం చేస్తూంటారు. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. ఈ ఎపిసోడ్ లో సినీ దర్శకుడు చేరన్ వ్యవహరించిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు. అసలేం జరిగిందంటే..

తమిళనాడులో ప్రైవేటు బస్సు డ్రైవర్ల దందా ఎక్కకువగా ఉంటుంది. బస్సును తీసుకొని రోడ్డు మీదకు వచ్చినంతనే.. ఇష్టారాజ్యంగా ఎయిర్ హారన్లు మోగిస్తూ దూసుకెళుతుంటారు. వీరి తీరుతో అదే రోడ్లపై వెళ్లే వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా ఉంటుంది. తాజాగా పుదుచ్చేరి నుంచి కడలూర్ కు బయలుదేరిన ప్రైవేటు బస్సు ముందుగా వెళుతున్న ప్రముఖ నటుడు కం దర్శకుడి కారును ఓవర్ టేక్ చేసింది.

ఈ సందర్భంగా సదరు డ్రైవర్ పెద్ద ఎత్తున ఎయిర్ హారన్లను వాడినట్లుగా చేరన్ చెబుతున్నారు. సదరు లారీని ఓవర్ టేక్ చేసిన చేరన్ బస్సును ఆపి.. సదరు డ్రైవర్ ను నిలదీశారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా తీసిన వీడియో వైరల్ గా మారుతోంది. క్రమశిక్షణ.. ప్రయాణికుల భద్రతకు ప్రశ్నగా మారిన డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏమైనా.. తన దారిన తాను పోకుండా.. తన కళ్ల ముందు జరుగుతున్న తప్పును వేలెత్తి చూపటంతో పాటు.. సదరు ప్రైవేటు బస్సు డ్రైవర్ కు క్లాస్ పీకినట్లుగా కూడా చెబుతున్నారు.

Tags:    

Similar News