ఆ ఒక్క‌చోటే కాదు... 7 నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన సెకండే.. !

ఒక‌టి రెండు కాదు.. ఏకంగా ఏడు నియోజ‌క వ‌ర్గాల్లో త‌మ్ముళ్లు పెత్త‌నం చేస్తున్నారు. అక్క‌డ గెలిచింది మాత్రం జ‌న‌సేన.. అధికారం మాత్రం టీడీపీది. దీనికి కార‌ణాలు కూడా ఉన్నాయి.

Update: 2024-11-23 20:30 GMT

జ‌న‌సేన పార్టీ విజ‌యం ద‌క్కించుకున్న 21 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ నాయ‌కులే ముందంజ‌లో ఉండాలి. ఉంటారు కూడా.. అని అంద‌రూ భావిస్తారు. అయితే.. రాజ‌కీయాలు రాజ‌కీయాలే. సో.. ఈ వ్య‌వ‌హారంలో వారు వెనుక‌బ‌డి పోతున్నారు. త‌మ్ముళ్ల‌దే పైచేయిగా ఉంది. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా ఏడు నియోజ‌క వ‌ర్గాల్లో త‌మ్ముళ్లు పెత్త‌నం చేస్తున్నారు. అక్క‌డ గెలిచింది మాత్రం జ‌న‌సేన.. అధికారం మాత్రం టీడీపీది. దీనికి కార‌ణాలు కూడా ఉన్నాయి.

ఈ ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అనేక మంది టికెట్లు త్యాగం చేశారు. ఈ క్ర‌మంలోనే టీడీపీ నేత లు.. జ‌న‌సేన‌కు టికెట్లు ఇవ్వాల్సి వ‌చ్చింది. ఇక‌, జ‌న‌సేన గెలిచిన త‌ర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్నా ఆత ర్వాత మాత్రం పెత్త‌నం అంతా టీడీపీవైపు మ‌ళ్లింది. అయితే.. ఈ విష‌యంలో నోరున్న నాయ‌కులు కొంత ఎదిరించి త‌మ స‌త్తా నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు విజ‌య‌న‌గ‌రం జిల్లా నెల్లిమ‌ర్ల లో లోకం మాధ‌వి.. టీడీపీ నేత‌ల‌కు వార్నింగులు ఇవ్వ‌డం వెనుక ఇదే కార‌ణం.

అయితే.. ఇలా నోరు చేసుకోలేని వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం త‌మ్ముళ్ల‌దే పెత్త‌నంగా ఉంది. తాజాగా రాయ‌లసీమ‌లోని కీల‌క‌మైన ఓ నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచింది జ‌న‌సేన కానీ, పెత్త‌నం టీడీపీదే అంటూ.. వ‌చ్చిన వార్త‌ల నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌సేన గెలిచిన వాటిలో టీడీపీ పెత్త‌నం ఎక్కువ‌గా ఉంద‌నే ది నిజ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి కార‌ణం.. జ‌న‌సేన త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న వారిలో కొత్త‌వారు ఎక్కువగా ఉండ‌డం.. ఆర్థికంగా వీక్‌గా ఉండ‌డం.

ఈ రెండు కార‌ణాల‌తో సుమారు 7 నియోజ‌క‌వర్గాల‌కు పైగానే.. జ‌న‌సేన గెలిచినా.. అక్క‌డ మాత్రం టీడీపీ నేత‌ల హ‌వానే సాగుతోంద‌న్న‌ది వాస్త‌వం. అయితే.. దీనిని కూట‌మి పార్టీల అగ్ర‌నాయ‌కులు ప‌ట్టించుకోవ డం లేదు. ఎవ‌రైతే ఏంటి.. ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని చెబుతున్నారు. అంతేకాదు.. వివాదాలు విభేదాలు రాకుండా క‌లిసి క‌ట్టుగా ముందుకు సాగితే.. త‌ప్పులేద‌ని కూడా అంటున్నారు. కానీ, వార్త‌లు మాత్రం ఆగ‌డం లేదు. మున్ముందు.. ఈ క‌లివిడి ఏమ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News