బీజేపీతో టీడీపీ పొత్తు వెనక చాలా కధ ఉందా...!?

కానీ చంద్రబాబు ఊరకే పొత్తులకు వెళ్లారు. ఆయన జనసేనను చేరదీసినా బీజేపీతో దోస్తీ చేసినా పక్కాగా లెక్క ఉంటుంది.

Update: 2024-02-10 15:30 GMT

ఏపీలో బీజేపీతో పొత్తు టీడీపీకి ఏమి లాభం అన్న చర్చను అందరూ చేస్తున్నారు. వాస్తవంగా చూస్తే అదే నిజం అని కూడా అనిపిస్తుంది. అర శాతం ఓట్లు ఉన్న బీజేపీకి ఏపీలో నలభై శాతం ఓట్లు ఉన్న టీడీపీకి పొత్తు ఏమిటి అని ఆశ్చర్యం ప్రకటించేవారూ ఉన్నారు. కానీ చంద్రబాబు ఊరకే పొత్తులకు వెళ్లారు. ఆయన జనసేనను చేరదీసినా బీజేపీతో దోస్తీ చేసినా పక్కాగా లెక్క ఉంటుంది.

జనసేనతో పొత్తు వల్ల ఒక బలమైన సామాజిక వర్గం టీడీపీ వెంట నడుస్తుంది. అలాగే సినీ గ్లామర్ కలిగిన పవన్ వెంట ఉంటే కామన్ ఓటర్ ఒపీనియన్ చేంజ్ అవుతుంది. ఇక యూత్ ఓట్లు కూడా టీడీపీకి టర్న్ అవుతాయి. ఎలక్షనీరింగ్ లో జనసేన క్యాడర్ సాయం కూడా ఆయాచితంగా లభిస్తుంది.

దాంతోనే ఎవరు ఏమి అనుకున్నా చంద్రబాబు జనసేనకు సీట్లు ఇస్తూ పొత్తులను కుదుర్చుకుంటున్నారు. ఈ రెండు పార్టీల పొత్తు ఓకే అయింది. ఇక ఇపుడు చూస్తే బీజేపీ విషయం. బాబు ఇటీవల స్వయంగా ఢిల్లీ వెళ్లి మరీ పొత్తులు పెట్టుకుని వచ్చారని టాక్. బీజేపీ కోరిన సీట్లు ఇచ్చేందుకు కూడా అంగీకరించారు అన్నది మరో ప్రచారం.

ఇలా చేయవచ్చా అన్నది కూడా సొంత పార్టీతో పాటు బయట కూడా చర్చ సాగుతోంది. కానీ ఏపీలో జగన్ ని కట్టడి చేయాలంటే బీజేపీ సాయం తప్పసరి అని బాబు భావిస్తున్నారు. నిజానికి చూస్తే ఇదే కరెక్ట్ స్ట్రాటజీ అని కూడా అంటున్నారు. జగన్ అధికారంలో ఉన్నారు. ఎలక్షనీరింగ్ లో ఆయన్ని కొట్టడం టీడీపీకి ఈ టైం లో చాలా కష్టం. ఆయనకు తోడు బీజేపీ సెంటర్ లో పవర్ లో ఉంది. బీజేపీ ప్లస్ జగన్ అంటే అగ్నికి వాయువు తోడు అయినట్లే.

దాంతో పోల్ మేనేజ్మెంట్ లో టీడీపీ దారుణంగా దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి. అంతే కాదు బూతుల వద్ద టీడీపీకి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు వచ్చినా పట్టించుకునే నాధుడు ఉండడని అంటున్నారు. అందువల్ల కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీని తమ వైపు తిప్పుకుంటే జగన్ ని కట్టడి చేయవచ్చు అన్నదే టీడీపీ ఎత్తుగడ.

అంతే కాదు మనీ ఫ్లో విషయంలో కూడా ఫ్రీ మూమెంట్ ఉండాలీ అంటే కేంద్రంలో పవర్ లో ఉన్న బీజేపీ అండ కావాలి. బీజేపీని తమ వైపు తిప్పుకుంటే అర్ధ బలం అంగబలం ఒకేసారి టీడీపీ జట్టులోకి వచ్చేస్తాయి. అందుకే చంద్రబాబు తెలివిగానే పావులు కదిపారు అని అంటున్నారు. అయితే బీజేపీ అడిగిన సీట్లు ఇచ్చేస్తే ఈ లాభం కాస్తా గూబల్లోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుందని అంటున్నారు.

ఇపుడు చూస్తే బీజేపీని అవును అనిపించుకుంటే ఆ తరువాత చంద్రబాబు చాణక్యంతో సీట్ల సర్దుబాటులోనూ పై చేయి సాధిస్తారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే బీజేపీ బలం బయటకు కనిపించని విధంగా ఉంటుంది. నీటిలో మొసలి మాదిరిగా అన్న మాట. ఆ బలం తెలిసిన వారు ఏపీలో ఇద్దరే ఇద్దరు. ఒకరు చంద్రబాబు. రెండవ వారు జగన్. అందుకే ఒకరి తరువాత ఒకరు ఢిల్లీ టూర్లు చేశారు అని అంటున్నారు.


Tags:    

Similar News