చంద్రబాబు ఇన్ కన్ఫ్యూజన్!

నిన్న కాక మొన్న చంద్రబాబు ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఏపీలో టీడీపీ ప్రభంజనం వీస్తోంది అని గట్టిగా చెప్పుకున్నారు.

Update: 2023-09-02 11:12 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు కన్ఫ్యూజన్ లో ఉన్నారా..ఆయన రాజకీయం ఏంటి, 2024 ఎన్నికల కోసం బాబు మార్క్ అజెండా రోడ్ మ్యాప్ ఏమిటి ఇది పార్టీలోని వారికే అర్ధం కావడం లేదు. నిన్న కాక మొన్న చంద్రబాబు ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఏపీలో టీడీపీ ప్రభంజనం వీస్తోంది అని గట్టిగా చెప్పుకున్నారు. అదే నోటితో ఆయన ఏపీలో పొత్తులు ఉంటాయని అవి ఎన్నికల వేళకు నిర్ణయించబడతాని పేర్కొన్నారు.

ఇలా ఆయనే రెండు రకాల స్టేట్మెంట్స్ ఇచ్చారు. దాంతో ఏపీలో టీడీపీ బలపడింది అని భావించాలా లేక పొత్తులతో వెళ్లడం అంటే ఒంటరి పోరుకు వెనకంజ వేస్తోంది అనుకోవాలో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. ఇక పార్టీలోని వారికి ఎలా ఉంది అంటే పొత్తులు ఉంటే సీట్లకు భారీగా కోత పడతాయి. దాంతో పొత్తులు వద్దు అనే వారే ఎక్కువగా ఉన్నారు అంటున్నారు.

అంతవరకూ ఎందుకు పొత్తులకు నారా లోకేష్ వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు. చంద్రబాబు విషయానికి వస్తే జనసేనతో బీజేపీతో వెళ్లాలని అనుకుంటున్నారు.కానీ లోకేష్ మాత్రం సింగిల్ పోరుకే మొగ్గు చూపిస్తున్నారు అని అంటున్నారు. అయితే ఇక్కడే చంద్రబాబు తన సీనియారిటీని ఉపయోగిస్తున్నారు అని అంటున్నారు.

పొత్తులు ఉండడం వల్ల లాభాలు ఉన్నాయన్నది బాబు ఆలోచన అంటున్నారు. కేంద్రంలో అధికారంలో బీజేపీ ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నాయి. ఎన్నికల వేళకు బీజేపీతో పొత్తు లేకపోతే జగన్ బీజేపీ అండతో పోల్ మేనేజ్మెంట్ చాలా ఈజీగా చేసుకుని టీడీపీని దెబ్బ తీస్తారు అని కలవరం అయితే టీడీపీ పెద్దలలో ఉన్నాయని అంటున్నారు.

అందువల్ల బీజేపీతో పొత్తు లేకపోయినా ఫరవాలేదు కానీ న్యూట్రల్ గా ఉన్నా చాలు అన్నది బాబు మార్క్ ప్లాన్ అని అంటున్నారు. ఎందుకంటే అలా బీజేపీ ఉన్నా కూడా టీడీపీ ఈజీగా పోల్ మేనేజ్మెంట్ చేసుకోగలుగుతుంది అని అంటున్నారు. అందుకోసమే బాబు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు.

బీజేపీతో పొత్తు అంటే ఏపీలో ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ కమ్యూనిటీ ఓట్లు టోటల్ గా టీడీపీకి పడకుండా పోతాయని బాబు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అందుకే పొత్తు కంటే బీజేపీని జగన్ కి దూరం చేయడం మీదనే చంద్రబాబు ఎక్కువగా ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు అని అంటున్నారు. ఏపీలో గత నాలుగున్నరేళ్ల వైసీపీ పాలన వల్ల ఏర్పడిన వ్యతిరేకతతో ఒక ఇరవై శాతం ఓట్లు అయినా మైనారిటీ ముస్లిం వర్గాల నుంచి టీడీపీకి షిఫ్ట్ అవుతాయని బాబు లెక్కలేసుకుంటున్నారు.

అవే వర్గాలు బీజేపీతో పొత్తు అంటే వెనక్కి పోతాయని ఆయన ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అదే టైంలో చూసుకుంటే లోకేష్ పాదయాత్ర సాగుతోంది అంటే అలా సాగుతోంది అన్న మాటే కానీ దాని వల్ల పొలిటికల్ గా మైలేజ్ ఏమీ పార్టీకి పెద్దగా రావడం లేదు అన్నది బాబు అంచనాగా ఉందని అంటున్నారు.

లోకేష్ స్పీచులతో జనంలోకి వెళ్తున్నా అవన్నీ జనాలను పెద్దగా ప్రభావితం చేసేవిగా లేవని అంటున్నారు. అయితే లోకేష్ మాత్రం పాదయాత్ర తరువాత తాను బాబు సరిసాటి లీడర్ ని అని భావిస్తున్నట్లుగా ఉందని అంటున్నారు. అందుకే ఆయన పొత్తులు అవసరం లేదు సింగిల్ గా ఫైట్ ఇచ్చినా టీడీపీ గెలుస్తుంది అని భావిస్తున్నారు అని అంటున్నారు.

ఇక్కడే బాబు ఆలోచన్లు భిన్నంగా ఉన్నాయని అంటున్నారు. మరో వైపు చూస్తే బీజేపీ అండ టీడీపీకి ఉండేలా చూసుకుని జగన్ని ఆ పార్టీకి దూరం చేసి జనసేనతో జతకడితే ఏపీలో తమకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని బాబు భావిస్తున్నారు. అయితే బాబు ఆలోచనలు ఈ విధంగా ఉంటే లోకేష్ మరోలా ఆలోచిస్తున్నారు.

ఇక క్యాడర్ అయితే తమ సీట్లు తేల్చమంటోంది. ఇవన్నీ చూసినపుడు మాత్రం చంద్రబాబు ఎటూ చెప్పలేక ఏమీ తేల్చుకోలేక ఇబ్బంది పడుతున్నారా అన్న చర్చకు తెర లేస్తోంది. అదే విధంగా ఆయన పెద్ద కన్ఫ్యూజన్ లో పడినట్లుగా తోస్తోంది అని అంటున్నారు.

Tags:    

Similar News