ఇది ఐటీ సర్వే అంటున్నారా...... ఆ పార్టీ గెలుస్తుందా....?

తెలంగాణా ఎన్నికల సమయంలో ఐటీ దాడులు జరగడంతో రచ్చ రచ్చగా ఉంది. అసలే రాజకీయం వేడిగా వాడిగా ఉంది

Update: 2023-11-10 01:49 GMT

తెలంగాణా ఎన్నికల సమయంలో ఐటీ దాడులు జరగడంతో రచ్చ రచ్చగా ఉంది. అసలే రాజకీయం వేడిగా వాడిగా ఉంది. ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా ఏ రాజకీయ పక్షం వదులుకోదు. అటువంటిది ఐటీ దాడులు అది కూడా విపక్షాల మీదనే అందులోనూ కొందరినే టార్గెట్ చేసి జరుపుతున్నారు అని మండిపోతున్నారు.

బీయారెస్ లో ఉండి ఎన్నికల వేళకు కాంగ్రెస్ లోకి వచ్చి పాలేరు నుంచి పోటీ చేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఐటీ దాడులు జరిగాయి. ఆయన ఈ సందర్భంగా మాటలతో కేంద్ర ప్రభుత్వం మీద మండిపోయారు. తాను బీజేపీలోకి వెళ్ళలేదని ఇలా దాడులు చేస్తున్నారు అని విమర్శించారు.

ఏకంగా తన సొంత అల్లుడి మీద అధికారులు చేయి చేసుకున్నారని కూడా పొంగులేటి ఆరోపిస్తున్నారు. ఇంత చేసినా లక్ష రూపాయలు అయినా పట్టుకున్నారా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఎంతసేపూ కాంగ్రెస్ వారి మీదనే ఈ దాడులు జరుగుతున్నాయంటే అర్ధమేంటి అని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారుఇ.

ఇదే తీరున మరి కొందరి కాంగ్రెస్ నేతల ఇళ్ల మీద దాడులు జరిగాయి. ఇదిలా ఉంటే దీన్ని కాంగ్రెస్ నాయకులు పాజిటివ్ గా తీసుకుంటున్నారు. తమకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావించే ఈ విధంగా దాడులు చేస్తున్నారు అని అంటున్నారు. ఐటీ దాడులు ఎందుకు చేస్తున్నారు అని ఆలోచిస్తే గ్రాఫ్ కాంగ్రెస్ కి బాగా పెరిగింది దాన్ని తగ్గించడానికేనా అని కూడా వారు అంటున్నారు.

మరి ఇప్పటిదాకా వచ్చిన అనేక సర్వేలు కాంగ్రెస్ బీయారెస్ లకు అధికారాన్ని అప్పగిస్తూ వచ్చాయి. ఇపుడు ఐటీ చేస్తున్న దాడులను చూస్తున్న కాంగ్రెస్ నేతలు ఇదంతా ఒక పద్ధతి ప్రకారం ఉద్దేశ్యపూర్వకంగా సాగుతోంది అని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ ఐటీ దాడులు ఎన్నికల వేళ సాగడం అంటే రచ్చ రచ్చగానే ఉంది.

మరో వైపు చూస్తే తమ మీదనే దాడులు అంటూ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. బీయారెస్ నేతల మీద దాడులు జరగడం లేదని అంటున్నారు. వారి మీద కూడా దాడులు చేయవచ్చు కదా. అలా చేయకూడదు అంటే కచ్చితంగా ఇది ఒక అవగాహనతో జరుగుతోంది అని అంటున్నారు. ఏది ఏమైన ఐటీ దాడులు కాంగ్రెస్ టార్గెట్ గా సాగుతున్నాయంటే మేము రేసులో దూసుకుపోతున్నట్లే అని కూడా హస్తం నేతలు గట్టిగా భావిస్తున్నారుట. చూడాలి మరి అన్ని సర్వేలూ అయ్య్యాయి. ఇపుడు ఈ ఐటీ సర్వే చెప్పేదేంటో. నిగ్గు తేల్చే నిజమేంటో. డిసెంబర్ 3న కానీ తెలియదు.

Tags:    

Similar News