అమెరికాలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం... కారణం ఇదే!
ఉన్నత చదువుల కోసం, వాటివల్ల వచ్చే ఉన్నత ఉద్యోగాల కోసం, ఫలితంగా లభించే ఉన్నతమైన జీవితం కోసం
ఉన్నత చదువుల కోసం, వాటివల్ల వచ్చే ఉన్నత ఉద్యోగాల కోసం, ఫలితంగా లభించే ఉన్నతమైన జీవితం కోసం.. అవకాశం, ఆసక్తి ఉన్న భారతీయులు చాలా మంది అమెరికాకు ప్రయాణమై వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు సంబంధించిన వరుస బ్యాడ్ న్యూస్ లు ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా మరో తెలుగు విద్యార్థి మృతిచెందాడు.
అవును... వివిధ కారణాలతో విదేశాల్లో దుర్మరణం పాలవుతున్న భరతీయ విద్యార్థుల జాబితాలో తాజాగా ఒక తెలంగాణ విదార్థి కూడా చేరడం తీవ్ర విషాధ వార్తగా మిగిలింది. స్నేహితులతొ కలిసి భోజనం చేస్తూ ఒక్కసారిగా అతడు కుప్పకూలిపోవడంతో వారంతా అక్కడ తీవ్ర విషాదంలో మినిగిపోయారు.
వివరాళ్లోకి వెళ్తే... సికింద్రాబాద్ లోని తిరుమలగిరికి చెందిన రిటైర్డ్ ఆర్డీవో తులసీరాజన్ పెద్ద కుమారుడు రుత్విక్ రాజన్ (30) అమెరికాలో మృతి చెందాడు. రెండేళ్ల క్రితం ఉన్నత విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్లిన రుత్విక్.. టెక్సాస్ యూనివర్శిటీలో ఇటీవలే ఎంఎస్ పూర్తిచేసాడు. ఈ క్రమంలో అక్కడే స్నేహితులతో ఉంటూ ఉద్యోగ వేటలో ఉన్నాడు.
ఈ క్రమంలో స్నేహితులతో కలిసి భోజనం చేస్తుండగా... ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించగా... అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఇందులో భాగంగా అతడు బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆ షాక్ నుంచి తేరుకునే ప్రయత్నం చేస్తూ... ఆ విషయాన్ని రుత్విక్ తల్లితండ్రులకు సమాచారం అందించారు.
దీంతో ఆ తల్లితండ్రుల ఆవేదన అంతా ఇంతా కాదని తెలుస్తుంది. ఉన్నత భవిష్యత్తు ఉంటుందని భావించి కొడుకును విదేశాలకు పంపిస్తే... అతడు ఇలా విగతజీవిగా తిరిగి వస్తుండటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి రుత్విక్ మృతదేహం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ సమయంలో కొడుకు మృతదేహాన్ని చూసిన తల్లితండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.