యూట్యూబ్ లో మళ్లీ తెలుగు ట్రావెలర్ల లొల్లి
అన్వేష్ ఇటీవలే 20 లక్షల సబ్ స్క్రైబర్ మార్క్ చేరుకున్నాడు. రవి తెలుగు ట్రావెలర్ చానెల్ కు 7.5 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు.
ప్రపంచంలో అత్యంత గొప్ప అభిరుచుల్లో ట్రావెలింగ్ ఒకటి. వివిధ ప్రదేశాలను చుట్టిరావడం, అక్కడి ప్రత్యేకతలను గమనించడం, వింతలు, విశేషాలను గుర్తుంచుకోవడం ఓ ప్రత్యేక అనుభూతి. అయితే, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమం వచ్చాక ట్రావెలింగ్ అనేది ఓ ప్రొఫెషన్ గానూ మారింది. సొంత అభిరుచిని కొందరు వీడియోలుగా చిత్రీకరిస్తూ ఆనందంతో పాటు ఆదాయం పొందుతున్నారు. యూట్యూబర్లుగా దండిగా డబ్బు సంపాదిస్తున్నారు.
తెలుగులో టాప్.. వివాదాల్లోనూ
తెలుగు ట్రావెలర్లలో అత్యధిక ఆదరణ పొందినవారు విశాఖపట్నానికి చెందిన అన్వేష్, రవి తెలుగు ట్రావెలర్, ఉమా తెలుగు ట్రావెలర్. వీరిలో అన్వేష్ తన పేరు కలిసొచ్చేలా ‘నా అన్వేషణ’ అంటూ యూ ట్యూబ్ చానెల్ ప్రారంభించి ప్రపంచ యాత్ర సాగిస్తున్నాడు. దాదాపు మూడేళ్లకు పైగా ఆయన వరల్డ్ టూర్ లో ఉన్నారు. ఇక రవి అసలు పేరు రవి ప్రభు. 28 ఏళ్ల కిందటే అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదవి అక్కడే పూర్తిగా స్థిరపడ్డారు. అమెరికన్ సిటిజన్ అయిన ఈయన ఇప్పటికే 190 పైగా దేశాలు తిరిగానని చెబుతుంటారు. మరో వ్యక్తి ఉమా. ఆఫక్రికా దేశాల్లో మూడేళ్ల కిందటి వరకు సాధారణ ఉద్యోగి. ఈ పని బంద్ చేసి ట్రావెలర్ గా మారారు. ప్రపంచ దేశాలు చుట్టివస్తున్నారు. వీరంతా తమదైన శైలిలో వీడియోలు చేస్తూ ఆదరణ పొందుతున్నారు.
లక్షల్లో సబ్ స్క్రైబర్లు.. లొల్లి కూడా అదేస్థాయిలో
అన్వేష్ ఇటీవలే 20 లక్షల సబ్ స్క్రైబర్ మార్క్ చేరుకున్నాడు. రవి తెలుగు ట్రావెలర్ చానెల్ కు 7.5 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఉమాకు ఇటీవలే 10 లక్షల సబ్ స్ర్కైబర్లు అయ్యారు.
అయితే, వీరి ముగ్గురి మధ్య గతంలో తీవ్ర వివాదం నడిచింది. రవి, ఉమా ఇద్దరూ మల్టీ చానెల్ నెట్ వర్క్ లో ఉంటూ తమ వీడియోలకు వ్యూస్ వచ్చేలా చేసుకుంటున్నారని అన్వేష్ వరుస వీడియోలు చేశాడు. ఇవి బాగా ప్రజల్లోకి వెళ్లాయి. కౌంటర్ గా రవి, ఉమా చేసిన వీడియోలూ ఇంతే ఆదరణ పొందాయి. ఇదంతా జరిగి ఏడాది, ఏడాదిన్నర దాటింది. ఆ తర్వాత పరిస్థితులు సద్దుమణిగాయి.
మోటో వ్లాగర్ తో జగడం
తాజాగా అన్వేష్ మోటో వ్లాగర్ భయ్యా సన్నీ యాదవ్ మధ్య జగడం మొదలైంది. భయ్యా సన్నీ యాదవ్ హైదరాబాద్ నుంచి అమెరికా వరకు బైక్ పై యాత్ర చేశానని ప్రకటించుకున్నాడు. సంబంధిత ఆధారాలు, వీడియోలు చూపుతున్నాడు. కానీ, దీనిని అన్వేష్ తప్పుబట్టాడు. ఇందులో నిజం ఎంత? అని ప్రశ్నించాడు. సన్నీ చేసనది వరల్డ్ టూర్ ఎలా అవుతుందని నిలదీశాడు. తోడుగా తమిళనాడు బైకర్ ను తీసుకెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు.
ఈ వ్యవహారం వివాదంగా మారింది. చివరకు భయ్యా సన్నీ యాదవ్ కూడా అంతేస్థాయలో ప్రతిస్పందిస్తూ వీడియో పెట్టాడు. చివరకు ఇది ఎక్కడకు వెళ్తుందో చూడాలి.