కేరళలో అమానవీయ ఘటన... 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం!

కేరళలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. సభ్య సమాజం తలదించుకునే ఘటన తెరపైకి వచ్చింది.

Update: 2025-01-11 08:22 GMT

కేరళలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. సభ్య సమాజం తలదించుకునే ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. ఓ 18 ఏళ్ల అథ్లెట్ పై సుమారు 60 మందికి పైగా వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడగా.. వారిలో ఆమె భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన కోచ్ లు, సహకరించాల్సిన తోటి ఆటగాళ్లు కూడా పలు మార్లు ఈ పనికి పాల్పడ్డారని ఆమె వెళ్లడించారని తెలుస్తోంది!

అవును... ఓ అమానవీయ ఘటన కేరళలో వెలుగు చూసింది. ఇందులో భాగంగా.. ఓ 18 ఏళ్ల అథ్లెట్ పై సుమారు 60 మందికి పైగా వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఘటన తెరపైకి వచ్చింది. తన 13వ ఏట నుంచే ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పిన ఆ యువతి.. చివరకు ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు తన ఆవేదనను పంచుకోవడంతో ఈ అమానుషం బయటకొచ్చింది.

ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో పలు దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని అంటున్నారు. ఇందులో భాగంగా.. బాధితురాలు 13 ఏళ్ల ప్రాయంలోనే తనపై అత్యాచారం జరిగిందని తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయంలో తన పక్కింట్లో ఉన్న ఓ వ్యక్తి తనను కొండల ప్రాంతానికి తీసుకెళ్లాడని.. ఆ సమయంలో అతడితో పాటు అతని స్నేహితులతో కలిసి అత్యాచారానికి ఒడిగట్టాడని వాపోయింది.

ఈ క్రమంలో తనపై పలువురు కోచ్ లు, తోటి ఆటగాళ్లు కూడా పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె తెలిపిందని చెబుతున్నారు. అయితే.. ఇంత జరిగినా భయంతోనే ఇన్నాళ్లూ ఈ విషయం బయట పెట్టలేదని ఆమె పేర్కొంది. ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది. ఈ సమయంలో పథనందిట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ సమయంలో సుమారు 62 మంది అనుమానితులను గుర్తించగా.. వీరిలో దాదాపు 40 మందిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఐదుగురు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బాధితురాలిని షెల్టర్ హోం కు తెరలించినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News