ఇటలీ ప్రధాని భాగస్వామి నోట... సమూహ శృంగారం మాట!

ఇదే సమయంలో, తోటి మహిళా ఉద్యోగులతోనూ గియాంబ్రూనే అసభ్యకరమైన కామెంట్లు చేయడం, పచ్చి బూతులు మాట్లాడటం చేశాడంటూ ఆరోపణలు వెల్లువెతుతున్నాయి.

Update: 2023-10-21 10:59 GMT

ఉన్నపలంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని భాగస్వామి ఆండ్రియా గియాంబ్రూనో వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అతనితో తన పదేళ్ల బంధానికి స్వస్థి పలకాల్సిన సమయం ఆసన్నమైందంటూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆన్ లైన్ వేదికగా ప్రకటించినప్పటినుంచీ... ఈయన ఇంతకాలం పడిన కథలన్నీ ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా మహిళా కొలీగ్స్ తో ఇతగాడి చేష్టలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

అవును... తన భాగస్వామి ఆండ్రియా గియాంబ్రూనో నుంచి విడిపోతున్నట్టు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ పదేళ్ల సుదీర్ఘ బంధానికి ముగింపు పలుకుతున్నానని ఆమె ఆన్ లైన్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా... టెలివిజన్ జర్నలిస్ట్ అయిన గియాంబ్రూనో.. ఇటీవలి మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు విమర్శలను ఎదుర్కొంటున్నారు. దీంతో జారియా మెలోని సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.

ఇదే సమయంలో, తోటి మహిళా ఉద్యోగులతోనూ గియాంబ్రూనే అసభ్యకరమైన కామెంట్లు చేయడం, పచ్చి బూతులు మాట్లాడటం చేశాడంటూ ఆరోపణలు వెల్లువెతుతున్నాయి. ఈ క్రమంలో అతడు తన సహోద్యోగిని అభ్యంతరకరంగా తాకినట్టు తాజాగా బయటపడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని వీడియోలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయని అంటున్నారు.

ఈ వీడియోలలో... బూతులు మాట్లాడుతూ మహిళా సహోద్యోగి ప్రైవేట్ పార్ట్స్ దగ్గరగా చేతులువేయడం... తనను ఇంతకే ముందు ఎందుకు కలవలేకపోయానబ్బా అని ఫీలయిపోతుండటంతోపాటు... గ్రూప్ సెక్స్‌ లో పాల్గొనాలంటే తనతో కలిసి పనిచేయొచ్చని చెప్పడం వంటివి దర్శనమివ్వడం ఇప్పుడు అత్యంత సంచలనంగా మారాయన్ని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ముగ్గురు, నలుగురితో చేసినట్లుగా మూడో వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నా అంటూ ఆఫర్లు ప్రకటించినట్లు తెలుస్తుంది.

దీంతో... ఇటలీ ప్రధాని సరైన నిర్ణయమే తీసుకున్నారనే కామెంట్లు సోషల్ మీడియా వేదికగా దర్శనమిస్తున్నాయి. ఇలాంటి వ్యక్తితో కలిసి ఉండటం కంటే... ఆమె విడిపోయి దూరంగా ఉండటమే కరెక్ట్ అనే కామెంట్లూ వినిపిస్తున్నాయట. ఇదే సమయంలో ఇతగాడి యవ్వారాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయని చెబుతున్నారు.

కాగా... ఇటలీలో స్థానికంగా చోటుచేసుకున్న సామూహిక అత్యాచార ఘటనలపై గియాంబ్రునో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సామూహిక అత్యాచారలు జరగడానికి అమ్మాయిలు అతిగా మద్యం సేవించడం, అనంతరం సృహ కోల్పోవడం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించాడంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.

దీంతో... గియాంబ్రునో మాటలను పరిగణలోకి తీసుకుని నాపై ఒక అభిప్రాయానికి రావొద్దంటూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కోరారు! ఈ క్రమంలో రియాక్ట్ అయిన గియాంబ్రూనో... మద్యం తాగేందుకు, డ్రగ్స్‌ కోసం యువత బయటకు వెళ్లొద్దని చెప్పడమే తన ఉద్దేశమని, బయట చెడు వ్యక్తుల నుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తగా ఉండాలని సూచించడమే తన మాటల్లోని పరమార్ధం అని సమర్ధించుకునే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది!

Tags:    

Similar News