అసెంబ్లీలో ఓడారు .. పార్లమెంటులో అడుగుపెట్టారు !

ఆరు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుండి గంగుల కమలాకర్ చేతిలో 3163 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు.

Update: 2024-06-06 07:46 GMT
అసెంబ్లీలో ఓడారు .. పార్లమెంటులో అడుగుపెట్టారు !
  • whatsapp icon

అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. కానీ లోక్ సభ ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావులు ఈ లోక్ సభ ఎన్నికల్లో గెలవడం అందరి దృష్టిని ఆకర్షించింది.

కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ రెండవసారి 2,25,209 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఆరు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుండి గంగుల కమలాకర్ చేతిలో 3163 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు.

ఈటెల రాజేందర్ గత శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్, హుజూరాబాద్ స్థానాల నుండి పోటీ చేశాడు. గజ్వేల్ లో కేసీఆర్ చేతిలో 45031 ఓట్ల తేడాతో, హుజూరాబాద్ లో పైడి రాకేష్ రెడ్డి చేతిలో 16873 ఓట్లతో పరాజయం పాలయ్యారు. తాజాగా మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుండి 3.90 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.

నిజామాబాద్ లోక్ సభలో ధర్మపురి అరవింద్ వరసగా రెండోసారి లక్ష పై చిలుకు ఓట్లతో గెలుపొందాడు. గత శాసనసభ ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ చేతిలో 10305 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశాడు. దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి చేతిలో 53513 భారీ మెజారిటీతో ఓటమి పాలైన రఘునందన్ రావు మెదక్ లోక్ సభ స్థానంలో 49 వేల ఓట్ల మెజారిటితో విజయం సాధించడం విశేషం.

Tags:    

Similar News