మోడీ కోసం మంచి రోజు మిస్ అవుతున్న బాబు!

దీంతో... మోడీ వల్ల చంద్రబాబు మంచి రోజు మిస్సవుతున్నారని అంటున్నారు.

Update: 2024-06-07 10:23 GMT

తాజాగా హస్తిన వేదికగా ఎన్డీయే కూటమి భేటీ జరిగింది. ఈ సందర్భంగా ప్రధానిగా మోడీ అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు బలపరిచారు. ఈ క్రమంలో కూటమి నేతలంతా హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యలో ఈ నెల 9 (ఆదివారం) ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం జరగబోతుంది. దీంతో... మోడీ వల్ల చంద్రబాబు మంచి రోజు మిస్సవుతున్నారని అంటున్నారు.

మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి దేశప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందులో భాగంగా... ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నారు! ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులను ఎంపిక చేశారని సమాచారం.

ఇందులో భాగంగా... బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రహిల్ విక్రం సింఘే, నేపాల్ ప్రధాని పుష్ప కమాల్ లతోపాటు భూటాన్, మారిషస్ ప్రధానులకు ఆహ్వానాలు పంపించారని అంటున్నారు. వీరితోపాటు మరికొంతమంది విశిష్ట అతిథులను కూడా మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారని తెలుస్తుంది.

వీరిలో శానిటేషన్ సిబ్బంది, ట్రాన్స్ జెండర్లు, సెంట్రల్ విస్టా నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవనున్నారని సమాచారం. ఆ సంగతి అలా ఉంటే... జూన్ 9 చాలా మంచిరోజని చెబుతున్నారు. ప్రధానంగా ఈ ముహూర్తం చంద్రబాబు జాతకానికి సూపర్ గా సూటవుతుందని.. అత్యద్భుతంగా కలిసి వస్తుందని అంటున్నారు.

అందువల్లే జూన్ 9న చంద్రబాబు నాలుగో సారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని కథనాలొచ్చాయి. అయితే... ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం కూడా అదే రోజు ఉండటంతో.. ఎన్డీయేలో కీలక వ్యక్తిగా ఉన్న చంద్రబాబు ఈ మంచి ముహూర్తాన్ని త్యాగం చేయక తప్పలేదని తెలుస్తుంది. దీంతో చంద్రబాబు ప్రమాణస్వీకారం జూన్ 12న ఉంటుందని చెబుతున్నారు.

వాస్తవానికి జూన్ 12 కూడా బలమైన ముహూర్తమే, మంచి రోజే, సూపర్ శుభగడియలున్న కాలమే అని అంటున్నప్పటికీ... చంద్రబాబు జాతకం రీత్యా జూన్ 9 అంత మంచి ముహూర్తం అయితే కాదంటున్నారు. అయినప్పటికీ... ప్రధానిగా వరుసగా మూడోసారి మోడీ ప్రమాణస్వీకారం కోసం ఆ మంచి రోజును చంద్రబాబు త్యాగం చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు.

కాగా... చంద్రబాబు ఈసారి సీఎంగా పగ్గాలు చేపడితే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఏకైక తెలుగు ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కనున్నారు. ఈ మేరకు ఈ చారిత్రాత్మక కార్యక్రమం కోసం భారీ ఎత్తున ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు పలువురు కేంద్రమంత్రులు హాజరవుతారని తెలుస్తుంది!

Tags:    

Similar News