టాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ గా పని చేసే ఆమె సూసైడ్!
అయితే.. రెండు రోజులుగా ఆమె బయటకు రావట్లేదు. ఇదిలా ఉండగా శనివారం అనుమానం వచ్చిన వాచ్ మెన్ ప్లాట్ వద్దకు వెళ్లి చూడగా.. దుర్వాసన రావటంతో అనుమానం వచ్చింది.
తెలుగు సినీ పరిశ్రమలో ఎగ్జిక్యూటివ్ మేనేజర్ గా పని చేసే ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న వైనం వెలుగు చూసింది. షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. రాజమహేంద్రవరం పట్టణం తాడితోట ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల దొమ్మటి రాజా స్వప్న వర్మ కొంతకాలం క్రితం హైదరాబాద్ కు వచ్చారు. సినీ పరిశ్రమలో ఎగ్జిక్యూటివ్ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఇండస్ట్రీలో ప్రొడక్షన్ విభాగంలో పని చేసే ఆమె మాదాపూర్ లో ఒక అపార్టుమెంట్ లో ఒంటరిగా ఉంటారు.
అయితే.. రెండు రోజులుగా ఆమె బయటకు రావట్లేదు. ఇదిలా ఉండగా శనివారం అనుమానం వచ్చిన వాచ్ మెన్ ప్లాట్ వద్దకు వెళ్లి చూడగా.. దుర్వాసన రావటంతో అనుమానం వచ్చింది. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వారు తలుపులు బద్దలు కొట్టి చూడగా.. బెడ్రూంలో ఆమె ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న వైనం వెలుగు చూసింది.
రెండు రోజుల క్రితమే ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకుందన్న దానిపై స్పష్టత రాలేదు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆమె స్నేహితుల నుంచి అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఆమె ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ నెల నాలుగోతేదీన ఒక స్నేహితురాలికి ఫోన్ చేసిన ఆమె రూ.50వేలు అప్పుగా అడగ్గా.. ఆమె ఫోన్ పేలో పంపిన వైనం వెలుగు చూసింది. ఆ తర్వాత ఆమె ఫోన్ చేసినా స్వప్న వర్మ ఫోన్ లిఫ్టు చేయలేదు. తాజాగా ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన ఆమె స్నేహతులు షాక్ కు గురవుతున్నారు. ఆమె కుటుంబ సభ్యులు ముంబయిలో ఉంటారన్న సమాచారంతో.. వారికి ఈ విషాద ఉదంతం గురించి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.