ఇండియాలో టాప్ 5 లగ్జరీ హౌసెస్.. ఎవరెవరివో తెలుసా?
అవును... ఒక మనిషి తాను ఎంత లగ్జరీగా బ్రతుకుతున్నదీ చెప్పడానికి అతడు నివాసం ఉంటున్న ఇల్లు ఒక సింబల్ అని అంటుంటారు.
ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని అంటారు! ఒక మనిషి జీవితంలో ఈ రెండు అత్యంత ప్రాముఖ్యమైనవి, జీవితంలో అతి ముఖ్యమైన మలుపులు అని చెబుతారు! ప్రస్తుతం ఈ రెండు విషయాలు లగ్జరీకి సింబల్స్ గా కూడా ఉంటున్న సంగతి తెలిసిందే. ఒక వ్యక్తి తన స్టేటస్ ని ప్రపంచానికి చూపించుకోవడానికి ఈ రెండే మార్గాలనే చర్చ కూడా ఉంది. ఇందులో పెళ్లి సంగతి కాసేపు పక్కనపెట్టి, ఇల్లు విషయనికొస్తే... ఇండియాలో టాప్ 5 లో ప్లేస్ సంపాదించుకున్న అద్భుతమైన నివాస స్థలాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి!
అవును... ఒక మనిషి తాను ఎంత లగ్జరీగా బ్రతుకుతున్నదీ చెప్పడానికి అతడు నివాసం ఉంటున్న ఇల్లు ఒక సింబల్ అని అంటుంటారు. ఎంతకాలం బ్రతికామనే సంగతి కాసేపు పక్కనపెడితే... ఎంత లగ్జరీగా బ్రతికామనేది ఇక్కడ హైలైట్ అవుతుంటుంది! ఈ క్రమంలో భారత్ లోని టాప్ 5 లగ్జరీ ఇల్లు ఎక్కడ ఉన్నాయి.. అందులో ఎవరుంటారు.. వాటిని నిర్మించడానికి అయిన ఖర్చు ఎంత.. ఆ ఇంటికి ఉన్న ప్రత్యేకతలేమిటి.. మొదలైన విషయాలను ఇప్పుడు చూద్దాం...!
యాంటిలియా:
భారతదేశంలోని అత్యంత సంపన్నుడు, ప్రపంచంలోని టాప్ 10 అత్యంత ధనవంతుల్లో ఒకరు అయిన ముఖేష్ అంబానీ ఇంటి పేరే "యాంటిలియా". ఇండియాలోని ఇల్లలో అత్యంత ఖరీదైన జాబితాలో ఇది నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. దక్షిణ ముంబైలోని ఈ భవనం మొత్తం 27 అంతస్తులను కలిగి ఉండగా.. 15వ శతాబ్ధపు స్పానిష్ ద్వీపం పేరే ఈ భవనానికి పెట్టారు.
ఇక పలు నివేదికల ప్రకారం ఈ భవనం నిర్మాణానికి రూ. 10,000 కోట్ల వరకూ ఖర్చు అయ్యి ఉంటుందని అంటున్నారు. దీంతో... బకింగ్ హోం ప్యాలెస్ తర్వాత ఇది ప్రపంచంలోనే రెండో ఖరీదైన ఇల్లుగా చెబుతున్నారు. ఇందులో హెల్త్ స్పా, స్విమ్మింగ్ పూల్స్, థియేటర్, డ్యాన్స్ స్టూడియో, యోగా స్టూడియో, హ్యాగింగ్ గార్డెన్, ఐస్ క్రీం పార్లర్ లతో పాటు మూడు హెలీప్యాడ్ లతో పాటు అనేక ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి!
జేకే హౌస్:
ప్రముఖ వ్యాపార దిగ్గజం, రేమండ్ గ్రూప్ చైర్మన్ గౌతం సింఘానియా నివాసమే... ముంబై లోని బ్రీచ్ కాండీ ప్రాంతంలో గల "జేకే హౌస్"! ఈ 30 అంతస్తుల భవనం కూడా అరేబియా సముద్ర దృశ్యాలను తిలకించే విధంగా తీర్చిదిద్దినట్లు చెబుతారు. ఇక ఈ భవనం విలువ సుమారు రూ.6,000 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.
ఇక ఇందులో ఐదు పార్కింగ్ అంతస్తులు, రెండు స్విమ్మింగ్ పూల్స్, స్పా, జిం, ప్రైవేట్ థియేటర్ తో పాటు హెలీప్యాడ్ కూడా ఉంది!
గులిత:
పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్.. తన కుమరుడు ఆనంద్ పిరమల్, ముఖేస్ అంబానీ కుమార్తె ఇషా అంబానీని వివాహం చేసుకున్న అనంతరం "గులిత" విలాసవంతమైన ఇంటిని బహుమతిగా ఇచ్చారు! ముంబైలోని ఈ ఐదంతస్తుల భవనం రీగల్ డిజైన్ కారణంగా బయట నుంచి కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది!
ఇక ఈ బంగ్లా విలువ సుమారు రూ.450 కోట్లు వరకూ ఉంటుందని చెబుతారు! ఇందులో ప్రైవేట్ పూల్, అండర్ గ్రౌండ్ పార్కింగ్, స్పేస్ డైనింగ్ ఏరియా, డైమండ్ రూం తదితర లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి!!
జతియ హౌస్:
ముంబైలోని మలబార్ హిల్స్ లో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా నివాసమే ఈ జయతీ హౌస్! సుమారు 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లా ఖరీదు సుమారు రూ.425 కోట్లుగా చెబుతారు. అందమైన సముద్ర దృశ్యం ఈ భవనానికి ప్లస్ పాయింట్ కాగా.. విలాసవంతమైన ఇంటీరియర్ ఈ భవనం సొంతం అని చెబుతారు. ఇందులో సుమారు 20 బెడ్ రూం లు, గార్డెన్ మొదలైనవి ఉన్నాయి!!
మన్నత్:
ఇక భారత్ లోని టాప్ 5 అద్భుతమైన ఇల్ల జాబితాలో "మన్నత్" ఒకటి!. ఇది బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నివాసం!. ముంబై లోని బాంద్రాలో ఉన్న ఈ బంగ్లా ఖరీదు సుమారు రూ.200 కోట్లకు పైమాటే అని చెబుతుంటారు. అరేబియా సముద్ర అలల సుందర దృశ్యాలను చూసే విధంగా... షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ ఆరు అంతస్తుల భవనాన్ని తీర్చిదిద్దినట్లు చెబుతారు. ఇందులో ప్రత్యేకంగా... జిం, స్విమ్మింగ్ పూల్, లైబ్రరీతో పాటు ప్రైవేట్ సినిమా థియేటర్ కూడా ఉందని అంటారు!