32 ఏళ్లుగా జనవరి 1న ఇచ్చి పుచ్చుకుంటున్న భారత్‌ - పాక్‌

ఇండియాకు పోటీగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అట్టర్ ఫ్లాప్‌ అయ్యే పాకిస్థాన్‌తో కొన్ని విషయాల్లో భారత్‌ ఒప్పందాలు చేసుకుని వాటిని కొనసాగిస్తూ వస్తుంది.

Update: 2025-01-01 16:27 GMT

భారతదేశానికి పాకిస్తాన్‌ అతి పెద్ద శత్రు దేశం. ఇండియా నుంచి కొంత భాగం ఆక్రమించుకున్న పాకిస్థాన్‌ ఎప్పుడూ ఏదో ఒక విషయమై కవ్విస్తూ ఉంటుంది. ఇండియాపై యుద్ధం కోసం అంటూ ఉగ్రవాదులను అక్కడి ప్రభుత్వం పెంచి పోషిస్తూ ఉంటుంది. ఏ విషయంలోనూ ఇండియాకు పోటీ కాని పాకిస్థాన్‌ ఎప్పుడూ తమదే పై చేయి అని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తూ విఫలం అవుతూ ఉంటుంది. ఇండియాకు పోటీగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అట్టర్ ఫ్లాప్‌ అయ్యే పాకిస్థాన్‌తో కొన్ని విషయాల్లో భారత్‌ ఒప్పందాలు చేసుకుని వాటిని కొనసాగిస్తూ వస్తుంది.

గత 32 ఏళ్లుగా జనవరి 1న ఇరు దేశాలు అణు స్థావరాలకు సంబంధించిన వివరాలను ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటాయి. ఇండియాలో అణు పరీక్షలు ఎక్కడ జరుగుతాయి, పాకిస్తాన్‌లో అణు పరీక్షలు ఎక్కడ జరుగుతాయి అనే వివరాలను ఏక కాలంలో రెండు దేశాలకు సంబంధించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతుంది. నేడు ఆ ఇచ్చి పుచ్చుకోవడం జరిగిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆ విషయాన్ని మీడియాకు సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రతి ఏడాది జనవరి 1న ఈ ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతుందని విదేశాంగ శాఖ ప్రకటించింది.

1988 డిసెంబర్‌ 31న భారత్‌, పాకిస్థాన్‌లు ఈ ఒప్పందం పై సంతకాలు చేశాయి. రెండు దేశాల్లోనూ అణు స్థావరాలపై దాడులు చేసుకోకుండా ఈ ఒప్పందం నిలుస్తుంది. రెండు దేశాల అణు స్థావరాల విషయంలో రెండు దేశాలకు ముందుగానే తెలియడం ద్వారా యుద్ధం వంటిది వచ్చిన సమయంలో అణు స్థావరాలపై దాడులు చేయకుండా ఉంటారు. ఒక దేశంలోని అణు స్థావరంపై దాడి జరిగితే వెంటనే మరో దేశంలోని అణు స్థావరం ముందుగానే తెలుసు కనుక దాడి చేయడంకు వీలు ఉంటుందని అనేది కొందరి అభిప్రాయం.

ఇండియా, పాకిస్థాన్‌ దేశాల మధ్య యుద్ద వాతావరణం ఎన్ని సార్లు నెలకొన్న అణు స్థావరాలపై మాత్రం దాడులు జరగలేదు. అణు స్థావరాలపై దాడులు జరిగితే దేశాలే నాశనం అయ్యే ప్రమాదం ఉంది. వేలాది మంది మృతి చెందే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ ఒప్పందం చాలా మంచిదని ఇరు దేశాల భద్రత అధికారులు అంటున్నారు. పాక్తిస్థాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడినా భారత్‌ ఎప్పుడూ భారీ యుద్దంకు దిగకుండా ఓపికగా ఉంటుంది. ఇలాంటి ఒప్పందాల కారణంగానే రెండు దేశాల మధ్య అంతో ఇంతో శాంతి వాతావరణం ఉంది.

Tags:    

Similar News