ట్రంప్ కు గుడ్ న్యూస్: తాజా సర్వేలో బైడెన్ ను దాటేశారు

అమెరికా అధ్యక్ష కుర్చీలో మరోసారి కూర్చోవాలని తహతహలాడుతున్న ట్రంప్ నకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.

Update: 2023-09-26 04:10 GMT

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే డొనాల్డ్ ట్రంప్.. మరోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందా? ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ తన అధిక్యతను కోల్పోతున్నారా? అధ్యక్ష పదవిలో మెరుపులు మెరిపించటం తర్వాత.. సగటు అమెరికన్ల మనసుల్ని దోచుకునే విషయంలో ఆయన వెనుకబడి పోయారన్న మాటకు బలం పెరుగుతోంది. తాజాగా వెల్లడైన సర్వేలు సైతం ఇదే విషయాల్ని చెబుతున్నాయి.

అమెరికా అధ్యక్ష కుర్చీలో మరోసారి కూర్చోవాలని తహతహలాడుతున్న ట్రంప్ నకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే తాను ప్రాతినిధ్యం వహించే రిపబ్లికన్ పార్టీలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తున్న ఆయన.. అధ్యక్ష రేసులోనూ అధిక్యతను ప్రదర్శిస్తుననారు.

తాజాగా వెల్లడైన సర్వేలో ఆయన అధ్యక్షుడు బైడెన్ కంటే కూడా ప్రజాదరణ విషయంలో అంతకంతకూ ముందుకు వెళుతున్నారు.

బైడెన్ కంటే ఏకంగా తొమ్మిది పాయింట్లు ముందు ఉండటం చూస్తే.. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ నకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న విషయం స్పష్టమవుతోంది. వాషింగ్టన్ పోస్టు.. ఏబీసీ న్యూస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో.. ట్రంప్ నకు 51 పాయింట్లు రాగా.. బైడెన్ కు 42 పాయింట్లకే పరిమితమయ్యారు.

మరోసారి అధ్యక్షుడిగా పని చేసే విషయంలో బైడెన్ వయసు మళ్లిన వ్యక్లిలా కనిపిస్తున్నారని.. ఆయనకంటే ట్రంప్ మెరుగ్గా ఉన్నట్లుగా సర్వేలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. బైడెన్ వయసు 80 ఏళ్లు కాగా.. ట్రంప్ వయసు 77 ఏళ్లు. నిజానికి వీరిద్దరి మధ్య వయసులో మూడేళ్లు తేడా అయినప్పటికీ.. బైడెన్ తో పోలిస్తే ట్రంప్ ఎంతో స్ట్రాంగ్ గా ఉండటమే కాదు.. 77 ఏళ్ల వ్యక్తిలా కనిపించకపోవటం గమనార్హం.

Tags:    

Similar News