క్రిస్టియన్ ఆరోపణలపై సీరియస్ గా రియాక్ట్ అయిన భూమన!

టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకం అనంతరం విపక్షాల నుంచి విపరీతమైన విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే.

Update: 2023-08-27 09:44 GMT

టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకం అనంతరం విపక్షాల నుంచి విపరీతమైన విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భూమన క్రీస్టియన్ అని.. ఆయన పిల్లలకు క్రైస్తవ వివాహాలు జరిపించారని రకరకాల ఆరోపణలు వచ్చాయి. ఈ సమయంలో టీడీపీ నేతలు, బీజేపీ నేతలు వరుసపెట్టి ఇవే పనులకు పూనుకుంటున్నారు. దీంతో... భూమన రియాక్ట్ అయ్యారు!

అవును... తాను క్రిస్టియన్ అంటూ వస్తోన్న ఆరోపణలపై తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భగా వీలైనంత విపులంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తాను పోరాటల నుంచి వచ్చినవాడిని అని భూమన చెప్పారు.

తాను క్రిస్టియన్ అంటూ చేస్తోన్న ఆరోపణలపై స్పందించిన ఆయన... తాను 17 సంవత్సరాల క్రితమే టీటీడీ చైర్మన్‌ గా పని చేశానని గుర్తు చేశారు. ఇదే సమయంలో 30 వేల మందికి కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు చేయించినట్లు భూమన వివరించారు.

ఇదే సమయంలో తిరుమల ఆలయ మాడవీధుల్లో చెప్పులతో వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది తానేనని వెల్లడించిన భూమన... అన్నమయ్య 600 వర్ధంతి ఉత్సవాలు జరిపింది కూడా తానేనని గుర్తు చేశారు. ఇదే క్రమంలో... దళిత వాడల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించింది తానేనని తెలిపారు.

అలాంటి తనను క్రిస్టియన్ అని, నాస్తికుడు అని ఆరోపణలు చేస్తున్న వారికి ఇదే తన సమాధానంగా భూమన కరుణాకర్ రెడ్డి కన్ క్లూ జన్ ఇచ్చారు.

మరోవైపు, ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారిపై ఉన్న భక్తి విశ్వాసాలను దెబ్బతీసేలా సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. టీటీడీ నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి, భక్తుల వసతుల కల్పనపై నెల రోజుల్లో ప్రదర్శన ఏర్పాటు చేస్తాం అని తెలిపారు.

Tags:    

Similar News