కవలలు .. స్కూలు మార్కుల్లోనూ కవలలే !

ఒడిశా రాష్ట్ర విద్యాశాఖ సోమవారం ప్రకటించిన పదో తరగతి ఫలితాలలో ఈ కవల సోదరీమణులు ఇద్దరూ సమాన మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

Update: 2024-05-29 09:30 GMT

ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న కార్తీక్ సాహుకు కవల పిల్లలు కరీనా, కరిష్మా బిస్వాల్ లు. వీరిద్దరూ ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలోని బలుగావ్‌లోని సరస్వతీ శిశు మందిర్‌లో చదువుతున్నారు.

ఒడిశా రాష్ట్ర విద్యాశాఖ సోమవారం ప్రకటించిన పదో తరగతి ఫలితాలలో ఈ కవల సోదరీమణులు ఇద్దరూ సమాన మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. వీరిద్దరూ 600 మార్కులకు గానూ 552 మార్కులు సాధించారు. హిందీలో 100కు 99 మార్కులు తెచ్చుకున్నారు. మంచి మార్కులు సాధించడంలో సహాయపడటానికి ఇద్దరికీ అదనపు కోచింగ్ అందించామని పాఠశాల యాజమాన్యం వెల్లడించింది.

“మొదట్లో మా పేర్ల పక్కన ఒకే మార్కులను చూసి షాక్ అయ్యాం. మేము మూడు-నాలుగు సార్లు క్రాస్ చెక్ చేసాం. బోర్డు పరీక్షలో మాకు ఒకే మార్కులు వచ్చినందుకు మేము సంతోషంగా ఉన్నాము” అని కవల సోదరీమణులు తెలిపారు. కరిష్మా ప్రొఫెసర్ కావాలని కోరుకుంటుండగా, కరీనా బ్యాంకర్ కావాలని కోరుకుంటుంది. వారి కలలు నెరవేరాలని ఆశిద్దాం.

Tags:    

Similar News