.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

ఖైదీలను సైనికులుగా మార్చేస్తున్న ఉక్రెయిన్..

దాదాపు రెండున్నర సంవత్సరాలుగా రష్యాతో ఉక్రెయిన్ పోరాడుతున్న విషయం మనందరికీ తెలిసిందే.

Update: 2024-07-01 14:30 GMT

దాదాపు రెండున్నర సంవత్సరాలుగా రష్యాతో ఉక్రెయిన్ పోరాడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ జైల్లో ఉన్న నేరస్తుల విషయంలో ఉక్రెయిన్ తీసుకున్న సరికొత్త నిర్ణయం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

గత కొంతకాలంగా రష్యాతో అలుపెరుగని యుద్ధం చేస్తోంది ఉక్రెయిన్. ఇప్పటికే ఈ యుద్ధ పరిణామం ఉక్రెయిన్ పౌరులపై ఎంతో తీవ్రంగా ఉంది. ఈ యుద్ధానికి సంబంధించిన విజువల్స్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటాయి. వాటిపై ఎందరో నెటిజెన్లు తమ బాధను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయం కాసేపు పక్కన పెడితే ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో జైల్లో ఉన్న ఖైదీల విషయంలో ఓసారి కొత్త నిర్ణయం తీసుకుంది. ఏకంగా ఖైదీలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటో తెలుసుకుందాం పదండి..

గత రెండున్నర సంవత్సరాలుగా రష్యా తో తలపడుతున్న ఉక్రెయిన్ యుద్ధ భూమిలో తీవ్రమైన సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది. సైన్యాన్ని మరింత బలోపేతం చేయాలన్న.. యుద్ధం పై పట్టు సాధించాలన్న సిపాయిలు అవసరం ఎంతో ఉంది. ఈ కొరతను పూడ్చడానికి మనంగా నియామకాలు కూడా చేపడుతుంది. ఈ క్రమంలో తొలిసారిగా జైలులో ఉన్నటువంటి ఖైదీలను కూడా మిలిటరీలో తీసుకోవడానికి ఈ దేశం సిద్ధపడింది.

అయితే ఉన్న ఖైదీల అందరిని తీసుకోవడం లేదు. వాళ్లకి కూడా ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. మాస్కోకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో చేరుతాము అనే ఖైదీల పై ఉన్న కేసులను కొట్టివేసి జైలు నుంచి విడుదల చేస్తాము అని బంపర్ ఆఫర్ ఉక్రెయిన్ ప్రకటించింది. ఇలా నిర్బంధంగా బతికే జీవితాలకు ముగింపు పలికి కొత్త జీవితాన్ని ప్రారంభించండి.. మీ మాతృభూమిని కాపాడుకోవడానికి యుద్ధభూమిలోకి దిగండి.. అంటూ ఖైదీలకు హితోపదేశం కూడా చేస్తుంది.

Read more!

అయితే ఇలా ఖైదీలుగా విడుదల చేసి వారిని మిలిటరీలో భాగం చేయడానికి గత నెల పార్లమెంట్లో ఓ ప్రత్యేకమైన బిల్ ని ఉక్రెయిన్ ఆమోదించింది. ఇప్పటికే సుమారు 3000 మంది ఖైదీలను పైలట్ ప్రోగ్రాం ద్వారా మిలటరీ యూనిట్లో తీసుకున్నారు. మరొక 27 వేల మంది కోసం కొత్తగా రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఖైదీలకు పడినటువంటి శిక్షణ సమీక్షించి, వారి ఆరోగ్య స్థితిగతులపై పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు.

హత్య, అత్యాచారం లాంటి కేసులలో శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖైదీలు మాత్రం ఈ ప్రక్రియకు అనర్హులు అని ఉక్రెయిన్ గవర్నమెంట్ ప్రకటించింది. ఇంటర్వ్యూలో ఎంపికైన ఖైదీలకు ఆర్మీ క్యాంప్ లో సాధారణ శిక్షణ అందిస్తారు. ఇందులో భాగంగా వారికి ఆయుధాలు ఎలా పట్టుకోవాలి , యుద్ధ పరికరాలు ఎలా ఉపయోగించాలి లాంటివి నేర్పిస్తారు. అనూహ్యంగా ఈ ప్రోగ్రాం కి ఖైదీల నుంచి మంచి స్పందన లభిస్తుంది. అయితే గతంలో రష్యా కూడా ఇదే విధంగా తమ జైల్లో ఉన్న ఖైదీలకు ఎలాంటి ఆఫర్ ఇచ్చింది. కానీ వాళ్ళని అధికారికంగా మిలిటరీలోకి తీసుకోలేదు.. కేవలం యుద్ధానికి మాత్రమే వాడుకున్నారు.

Tags:    

Similar News