అంబానీ ఇంట పెళ్లికి ముందుగా సామూహిక వివాహాలు
ఆసక్తికర అంశాలు బోలెడన్ని బయటకు వస్తున్నాయి. ఈ నెల 12న జరిగే ఈ వివాహ వేడుకకు ముందుగా ఇప్పటికే ఎంగేజ్ మెంట్ తో పాటు
ఆసక్తికర అంశాలు బోలెడన్ని బయటకు వస్తున్నాయి. ఈ నెల 12న జరిగే ఈ వివాహ వేడుకకు ముందుగా ఇప్పటికే ఎంగేజ్ మెంట్ తో పాటు.. రెండుసార్లు ప్రీవెడ్డింగ్ వేడుకల్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ముచ్చటగా మూడో ప్రీవెడ్డింగ్ డేను రేపు (మంగళవారం, జులై 2న) నిర్వహిస్తున్నారు. ఈసారి జరిగే అనంత్ అంబానీ - రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ లో ప్రత్యేకత ఏమంటే.. భారీగా సామూహిక పెళ్లిళ్లను నిర్వహించటం. ఈ కార్యక్రమానికి అంబానీ కుటుంబం కూడా హాజరు కానుంది.
పాల్ఘర్ లోని స్వామి వివేకానంద విద్యా మందిర్ లో మంగళవారం సాయంత్రం వేళలో పలు పేద కుటుంబాల పెళ్లిళ్లను జరిపిస్తున్నారు. ఈ వేడుకకు ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యులు హాజరవుతున్నారు. ఇంతకు ముందు నిర్వహించిన ప్రీవెడ్డింగ్ నిర్వహించిన ప్రాంతానికి దగ్గర్లోని గ్రామాల్లో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జులై 12 నమొదలయ్యే వీరి వివాహ మహోత్సవ వేడుక ముచ్చటగా మూడు రోజులు సాగనుంది.
జులై 12న శుభ్ వివాహ్ తో మొదలు కానుంది. జులై 13న శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమాన్ని జులై 14న మంగళ్ ఉత్సవ్ తో ముగిస్తారు. ముఖ్యమైన పెళ్లి వేడుక జులై 12న జరగనుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికకు సంబంధించిన వీడియో వైరల్ గా మారటం తెలిసిందే.
తొలి పెళ్లి పత్రికను కాశీ విశ్వనాథుని పాదాల వద్ద ఉంచి.. ఆశీస్సులు పొందటం తెలిసిందే. పలువురు ప్రముఖుల ఇళ్లకు స్వయంగా వెళుతున్న అంబానీ కుటుంబ సభ్యులు వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. మొత్తంగా తమ ఇంట్లో జరిగే పెళ్లి వేడుక వేళ.. పేదల ఇళ్లల్లోనూ భారీగా పెళ్లిళ్లు నిర్వహించటం.. అన్నదానాలు చేపట్టటం లాంటివి చేయటం ఆసక్తికరంగా మారింది.