'ఉండి' కొల్లగొడతాడా ?

ఏపీ రాజకీయాల్లో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుది ప్రత్యేక స్థానం.

Update: 2024-05-23 04:09 GMT

ఏపీ రాజకీయాల్లో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుది ప్రత్యేక స్థానం. గత ఎన్నికల్లో వైసీపీ తరపున నరసాపురం ఎొంపీగా గెలిచిన కొన్నాళ్లకే ముఖ్యమంత్రి జగన్ తో విభేదించి విమర్శలు ఎక్కుపెట్టాడు. దీంతో ఆయన పార్టీకి దూరమయ్యాడు.

దీంతో ప్రభుత్వానికి రఘురామకు చెడి కేసుల పాలయ్యాడు. ఏపీలో అడుగుపెడితే ఏమవుతుందో అన్న భయంతో నాలుగేళ్లు ఢిల్లీ, తెలంగాణకే పరిమితం అయ్యాడు. ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యాక తెలుగుదేశం పార్టీలో చేరి చివరి నిమిషంలో టీడీపీ టికెట్ పై ఉండి శాసనసభ స్థానం నుండి పోటీకి దిగాడు.

ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి టీడీపీకి పెట్టనికోట. 1983 నుండి 1999 వరకు కలిదిండి రామచంద్రరాజు వరసగా ఐదు సార్లు గెలిచాడు. 2004లో మాత్రమే అక్కడ కాంగ్రెస్ గెలిచింది. 2009, 2014లో రెండు సార్లు శివరామరాజు, 2019లో మంతెన రామరాజు టీడీపీ నుండి విజయం సాధించారు. ఇక్కడ ఈసారి రఘురామ కృష్ణంరాజు విజయం ఖాయమని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణరాజు విజయంపై ఉండి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బెట్టింగ్స్ జరుగుతున్నాయి. రఘురామకు 15 వేల మెజార్టీ వస్తుందని కొందరు,,అంత మెజార్టీ రాదని మరికొందరు అంటున్నారు. రఘురామ విజయంపై దాదాపు రూ.35 కోట్ల వరకు బెట్టింగ్ జరుగుతున్నట్టు సమాచారం. కాళ్ల మండలంలో భూములను పందెం కాస్తున్నారని తెలుస్తుంది. జూన్ 4న ఈవీఎంలు తెరిస్తే అభ్యర్థుల భవితవ్యం బయటపడుతుంది.

Tags:    

Similar News