'ఉండి'లో రికార్డులో కొల్లగొట్టాడు !
ఇక్కడ ఒక్క 2004లో కాంగ్రెస్ నుండి పత్తిపాటి సర్రాజు మాత్రమే విజయం సాధించాడు.
1983 నుండి ఉండి శాసనసభ స్థానం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కంచుకోట. ఇక్కడ ఒక్క 2004లో కాంగ్రెస్ నుండి పత్తిపాటి సర్రాజు మాత్రమే విజయం సాధించాడు.
1983. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరసగా కలిదిండి రామచంద్ర రాజు వరసగా విజయం సాధించారు. 2009, 2014 ఎన్నికల్లో శివరామ రాజు, 2019 ఎన్నికల్లో మంతెన రామరాజు టీడీపీ తరపున విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో చివరి నిమిషంలో చంద్రబాబు నాయుడు రఘురామ కృష్ణంరాజును బరిలోకి దింపారు. అతి తక్కువ సమయం ఉన్నా గతంలో ఎన్నడూ లేనంతగా 56777 ఓట్ల రికార్డ్ మెజారిటీతో వైసీపీ అభ్యర్థి పెన్మత్స వెంకట లక్ష్మీ నరసింహరాజుపై గెలుపొందడం విశేషం. ఇక్కడ రెబెల్ గా మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఉన్న 13260 ఓట్లు సాధించినా రఘురామకు రికార్డ్ మెజారిటీ దక్కడం విశేషం.