బాబుకు కౌంటర్ : టిప్పర్ నడుపుకుంటూ వెళ్లి

ఎన్నికలు వచ్చాయంటే అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్న ప్రచార కార్యక్రమాలు చేపట్టడం తరచుగా చూస్తుంటాం

Update: 2024-04-24 16:22 GMT

ఎన్నికలు వచ్చాయంటే అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్న ప్రచార కార్యక్రమాలు చేపట్టడం తరచుగా చూస్తుంటాం. ఇక కొందరు ఎన్నికలలో సంచలనం కోసం నామినేషన్లు వేస్తారు. కొందరు మీడియాలో పబ్లిసిటీ కోసం నామినేషన్లు వేస్తారు. ఆగ్రా జిల్లాలోని ఖేరాగఢ్ తహసీల్‌కు చెందిన 78 ఏళ్ల హస్నూరామ్ అంబేద్కరీ 98 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాడు. ఇటీవల 99వ సారి వేసిన నామినేషన్ తిరస్కరణకు గురయింది. ఇది ఇలా ఉంటే ఏపీ ఎన్నికలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టిప్పర్ నడుపుకుంటూ వచ్చి ఓటేయడం అందరినీ ఆకర్షిస్తున్నది.

గత ఎన్నికలలలో సామాన్య కార్యకర్త అయిన నందిగం సురేష్ కు ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాడు వైఎస్ జగన్. ఈసారి అనంతపురం జిల్లా శింగనమల నుండి మరో సామాన్య కార్యకర్త అయిన టిప్పర్ డ్రైవర్ అయిన వీరాంజనేయులు వైసీపీ తరపున బరిలోకి దింపాడు జగన్.

సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన జొన్నలగడ్డ పద్మావతిని పక్కనపెట్టి మరీ జగన్ వీరాంజనేయులుకు టికెట్ కేటాయించడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ఇక్కడ పార్టీ ప్రచారానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘‘టిప్పర్ డ్రైవర్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారంటూ’’ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. రామాంజనేయులు గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డి వద్ద టిప్పర్ టిప్పర్ డ్రైవర్ గా పనిచేశాడు.

వైసీపీలో చురుకుగా ఉండే వీరాంజనేయలుకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కగా ఈ రోజు ఆయన నామినేషన్ వేశాడు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఈ రోజు ఆయన టిప్పర్ నడుపుకుంటూ మరి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వరకు వెళ్లి తన నామినేషన్ పత్రాలను అందజేయడం విశేషం.

Tags:    

Similar News