పీ.హెచ్.డీ చేస్తున్న ఇండియన్ క్రికెటర్... త్వరలో డాక్టర్ అంట!

క్రికెటర్లు కేవలం క్రికెట్ పరిజ్ఞానానికే పరిమితం కాకుండా సాధారణ పరిజ్ఞానం సంపాదించడం కోసం చదువుకోవాలని కోరుకుంటున్నట్లు చెబుతున్నారు ఇండియన్ క్రికెటర్.

Update: 2024-12-09 19:30 GMT

క్రికెటర్లు కేవలం క్రికెట్ పరిజ్ఞానానికే పరిమితం కాకుండా సాధారణ పరిజ్ఞానం సంపాదించడం కోసం చదువుకోవాలని కోరుకుంటున్నట్లు చెబుతున్నారు ఇండియన్ క్రికెటర్. తాను ప్రస్తుతం పీ.హెచ్.డీ. చేస్తున్నానని.. త్వరలో తన పేరు ముందు "డాక్టర్" వచ్చి చేరబోతుందని చెబుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతడే... వెంకటేశ్ అయ్యారు.

అవును... క్రికెటర్లు కేవలం క్రికెట్ పరిజ్ఞానానికి మాత్రమే పరిమితం కాకుండా సాధారణ పరిజ్ఞానం సంపాదించడం కోసం చదువుకోవాలని తాను కోరుకుంటున్నట్లు చెబుతున్నాడు కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) స్టార్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్. ఇందులో భాగంగా.. కనీసం గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్-గ్రాడ్యుయేషన్ అయినా పూర్తి చేయాలని చెబుతున్నాడు.

ప్రస్తుతం తాను పీ.హెచ్.డీ (ఫైనాన్స్) చేస్తున్నట్లు చెప్పిన వెంకటేశ్ అయ్యర్.. నెక్స్ట్ టైం ‘డాక్టర్’ వెంకటేశ్ అయ్యర్ ని ఇంటర్వ్యూ చేస్తారని అన్నారు. ఇక... మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను క్రికెట్ పై మాత్రమే ఫోకస్ పెడతా అంటే పేరెంట్స్ ఒప్పుకోవడం చాలా కష్టమని తెలిపాడు వెంకటేశ్ అయ్యారు.

అయితే తాను మాత్రం ఓ పక్క బాగా చదువుతూ.. మరోపక్క క్రికెట్ లోనూ రాణించాలని తన పేరెంట్స్ కోరుకున్నారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా చదువుపై తనకున్న అభిప్రాయాన్ని.. దాని గొప్పతనాన్ని మరింత వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా.. ఓ క్రికెటర్ 60 ఏళ్ల వరకూ ఆడలేడని.. విద్య మాత్రం చనిపోయేవారకూ మనతోనే ఉంటుందని తెలిపాడు.

ఈ నేపథ్యంలో.. జీవితంలో నిజంగా రాణించాలంటే చదువుకోవాలని.. ఆ ఉత్తమ చదువు ఆటలోనూ సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహకరిస్తుందని.. తాను మైదానంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి చదువు కూడా సహాయపడుతుందని.. జీవితంలోనూ సరైన నిర్ణయాలు తీసుకోవడానికి విద్య ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు.

కాగా... 2018లో ఎంబీఏ ఫైనాన్స్ పూర్తి చేసిన వెంకటేశ్ అయ్యర్.., తర్వాత బెంగళూరులోని డెలాయిట్ కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ వచ్చినా వెళ్లలేదు. ఓ పక్క జాబ్ చేస్తూ, తనకు ఇష్టమైన క్రికెట్ పై పూర్తిస్థాయిలో దృష్టిసారించడం కష్టమని భావించడంతో ఆ ఆఫర్ ను తిరస్కరించాడు. అయితే ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో జాక్ పాట్ కొట్టాడు!

ఇందులో భాగంగా... అతడిని కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) వెంకటేశ్ అయ్యర్ ను రూ.23.75 కోట్లకు సొంతం చేసుకుంది.

ఇక 2021లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేశ్ అయ్యర్ ఇప్పటివరకూ 51 మ్యాచ్ లు ఆడాడు. ఆల్ రౌండర్ అయిన అయ్యర్... 31.57 యావరేజ్ తో 1326 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ (104), 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక బౌలింగ్ విభాగంలో... మూడు వికెట్లు తీయగా.. అందులో బెస్ట్ 2/29.

Tags:    

Similar News