విడదల రజనీకి మహిళా పారిశ్రామికవేత్త తో చెక్...!?

గుంటూరు జిల్లాలో మహిళా మంత్రి విడదల రజనీని చిలకలూరిపేట నుంచి విశాఖ పశ్చిమకు షిఫ్ట్ చేశారు.

Update: 2024-02-12 03:53 GMT

గుంటూరు జిల్లాలో మహిళా మంత్రి విడదల రజనీని చిలకలూరిపేట నుంచి విశాఖ పశ్చిమకు షిఫ్ట్ చేశారు. అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ సీటులో ఆమె గెలిచి వస్తుందని వైసీపీ పక్కాగా వ్యూహం పన్నుతోంది. దీంతో మంత్రి రజనీ తన ఆఫీసు ని ప్రారంభించి మరీ ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేశారు.

ఇక్కడ టీడీపీ అనేక మంది పేర్లను పరిశీలిస్తోంది కానీ అనూహ్యంగా కొత్త పేరుని తెర మీదకు తెస్తోంది. ఇప్పటిదాకా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల పేర్లు చూసిన టీడీపీ ఉన్నట్లుండి కొత్త ముఖాన్ని ఇక్కడ అభ్యర్ధిగా ప్రకటిస్తుందని అంటున్నారు.

ఆ కొత్త ముఖం రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని వారిది అని అంటున్నారు. ఒక విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తగా ఉన్న వారిని మంత్రికి పోటీగా టీడీపీ ఎంపిక చేయనుంది అని అంటున్నారు. డెయిరీ వ్యాపారంలో గత కొన్నేళ్ళుగా సక్సెస్ ఫుల్ గా దూసుకుని పోతున్న శ్రీ సురభి మిల్క్ చైర్ పర్సన్ వీఆర్ లక్ష్మీ శ్యామలను ఈసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీలో దింపాలని టీడీపీ మాస్టర్ ప్లాన్ వేసింది అని అంటున్నారు.

ఇంతకీ ఆమె ఏమిటి అంటే చాలానే అని అంటున్నారు. కేవలం గుంటూరు జిల్లాలోనే కాకుండా క్రిష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరులలో కూడా అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని అంటున్నారు. అదే విధంగా ఆమె శ్రీ శురభి మిల్క్స్ అనంది పాడిపరిశ్రమ మీద ఆధారపడిన రైతులకు అండగా ఉంటోంది.

ఇలా వ్యాపారపరంగానే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా కూడా లక్ష్మీ శ్యామలా ముందుకు సాగుతున్నారు. మంచి పేరు ఉండడమే కాకుండా అంగబలం అర్ధ బలం ఉన్న వారు కావడంతో టీడీపీ అధినాయకత్వం ఆమె వైపు చూస్తున్నట్లుగా విశ్వసనీయమైన సమాచారంగా ఉంది.

అనుకున్నదే తడవుగా పార్టీ పెద్దలు కూడా ఆమెతో సంప్రదింపులు చేశారు అని అంటున్నారు. ఆమె వైపు నుంచి కూడా అంగీకారం వచ్చింది అని అంటున్నారు. దీంతో అన్నీ అనుకూలిస్తే తొందరలోనే ఆమె పేరుని గుంటూరు పశ్చిమ నుంచి ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

గుంటూరు పశ్చిమ నుంచి టీడీపీ 2014, 2019లలో రెండు సార్లు గెలిచింది. ఈసారి కూడా గెలవాలని పట్టుదలగా ఉంది. అక్కడ 2019లో టీడీపీ నుంచి గెలిచిన మద్దాల గిరి వైసీపీలోకి చేరిపోయారు. దాంతో ఈసారి ఆ సీటుని ఎలాగైనా నిలబెట్టుకోవాలని టీడీపీ పట్టుదలగా ఉంది. పైగా రాజధాని ప్రాంతంలోని సీటు కావడంతో కూడా ఆచీ తూచీ అభ్యర్ధుల ఎంపిక సాగుతోంది అని అంటున్నారు.


Tags:    

Similar News