విశాఖ ఉక్కులో ఉద్యోగాలు ఉష్ కాకీ ?
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఒక నినాదం బలంగా అయిదున్నర దశాబ్దాల క్రితం వినిపించింది.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఒక నినాదం బలంగా అయిదున్నర దశాబ్దాల క్రితం వినిపించింది. అదే విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కారణం అయింది. విశాఖ ఉక్కు కోసం ఎంతో మంది తమ భూములను ఇచ్చి నిర్వాసితులు అయ్యారు. వారి కుటుంబాలలో సగానికి సగం మందికి ఈ రోజుకీ ఉద్యోగాలు దక్కలేదు.
విశాఖ ఉక్కు ప్రారంభించి నాలుగున్నర దశాబ్దాలు అవుతోంది. ఎంతో భూమి ఉంది. కష్టించే ఉద్యోగులు కార్మికులు ఉన్నారు. ఉక్కు కర్మాగారం సామర్ధ్యాన్ని కూడా భారీగా పెంచుకోవచ్చు. విశాఖ ఉక్కు అంతర్జాతీయంగా నాణ్యమైనది కూడా. ఇన్ని మంచి విషయాలు ఉన్నా విశాఖ ఉక్కుకు ఎన్నో ప్లస్ పాయింట్లు ఉన్నా కేంద్ర పెద్దల శీత కన్నుకు బలి అవుతోంది.
సరిగ్గా మూడున్నరేళ్ల క్రితం విశాఖను ప్రైవేట్ పరం చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఈ రోజుకి కూడా ఆ విషయంలో మరో మాట అయితే కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం లేదు. దానికి ప్రాతిపదిక అన్నట్లుగా ఉక్కుకు కష్టాల మీద కష్టాలు చూపిస్తున్నారు. అంతే కదు విశాఖ ఉక్కుకు అవసరం అయిన ముడి సరుకు సరఫరా కాకుండా చూస్తున్నారు.
వివిభ కీలక విభాగాలను మూసివేసే దిశగా యత్నాలు సాగుతున్నాయి. ఈ నేపధ్యంలో విశాఖ ఉక్కులో ఉద్యోగులు కార్మికులు అన్న వారు పదవీ విరమణ చేయడమే తప్ప వారి ప్లేస్ లోకి కొత్త వారు రావడం అంటూ జరగడంలేదు. ఆ విధగ్నా చూస్తే వేలాది మందితో అలరారే విశాఖ ఉక్కు ఇపుడు తుక్కుగా మారిత్పోంది. ఒకనాడు పనిచేసి పాతిక ముప్పయివేల మంది ఉక్కు కార్మికులు ఉద్యోగులలో స్థానంలో ప్రస్తుతం 19 వేల మంది మాత్రమే మిగిలిపోయారు ఈ ఏడాది పూర్తి అయ్యేటప్పటికి వీరిలో ఏకంగా 11 వేల మంది పదవీ విరమణ చేస్తారు.
అపుడు విశాఖ ఉక్కులో మిగిలేది కేవలం ఎనిమిది మంది వేల మంది ఉద్యోగులే అని అంటున్నారు. ఇది విశాఖ ఉక్కు ఉత్పత్తి మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది అని అంటున్నారు. పదవీ విరమణ చేసిన వారి స్థానంలో కొత్త వారిని తీసుకుంటేనే సంస్థ కళకళలాడుతుందని అదే విధంగా విశాఖ ఉక్కు అభివృద్ధి పథంలో సాగుతుందని అంటున్నారు.
కానీ కేంద్ర ప్రభుత్వానికి ఆ ఉద్దేశ్యం లేనందువల్లనే విశాఖ ఉక్కుని నానాటికీ బలహీనం చేసే చర్యలకే మద్దతు ఇస్తున్నారు అని అంటున్నారు. దీంతో ఉద్యోగ కార్మికుల కొరత తీవ్రంగా ఏర్పడి అనేక విభాగాలు మూతపడతాయని ఉక్కు కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ కానీయమని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని కూటమి నేతలు మాటలు అయితే చెబుతున్నారు కానీ ఆచరణలో మాత్రం అది జరగడం లేదని అంటున్నారు. కేంద్రంలో ఏపీలో కొత్త ప్రభుత్వాలు వచ్చి మూడు నెలలు గడచినా విశాఖ ఉక్కు మీద సరైన నిర్ణయం తీసుకోవడానికి తీరిక లేదా అని కూడా కార్మిక నాయకులు ప్రశ్నిస్తున్నారు.
మరో వైపు చూస్తే వీఆర్ ఎస్ అని కొత్త పధకాన్ని కూడా విశాఖ ఉక్కులో తీసుకుని వస్తున్నారని అంటున్నారు. 2025 నాటికి మరో 2,500 మందిని ఆ విధంగా ఉధ్వాసన పలికేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు అని అంటున్నారు. ఈ మొత్తం పరిణామాలు చూస్తూంటే విశాఖ ఉక్కు బలిపీఠం మీదనే ఉందని అంటున్నారు.