పవన్ సూపర్ స్పీడ్ ...మరి చంద్రబాబు ?

అలా ఏపీ పాలిటిక్స్ లో బాబు పవన్ లది మల్టీ హీరోస్ పొలిటికల్ మూవీ అని చెప్పాలి.

Update: 2025-01-04 00:15 GMT

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడు నెలలకు దగ్గర కావస్తోంది. ఒక అర్ధ శతాబ్దం రాజకీయ అనుభవం, పాలనాపరంగా నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న వారు టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాజకీయంగా పదేళ్ళ అనుభవం, పాలనాపరంగా జీరో ఎక్స్పీరియన్స్ తో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో బాబుతో జోడీ కట్టారు.

అలా ఏపీ పాలిటిక్స్ లో బాబు పవన్ లది మల్టీ హీరోస్ పొలిటికల్ మూవీ అని చెప్పాలి. బాబు అనుభవం ఆయన వ్యూహాలు ఆయన రాజకీయం చూసిన వారు ఎవరైనా బాబు ముందు పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఎలా నెట్టుకుని వస్తారు అని అనుకున్నారు. అయితే బాబుతో సమానంగా పవన్ కూడా తన పాలనాపరమైన ముద్రను గట్టిగానే వేస్తూ ముందుకు సాగుతున్నారు.

అంతే కాదు పవన్ కళ్యాణ్ కి అదనపు యాడింగ్ ఏంటి అంటే గ్లామర్. ఆయనకు ఉన్న జనాకర్షణ శక్తితో ఆయన ఏమి చేసినా కూటమి ప్రభుత్వం లో హైలెట్ అవుతున్నారు. అంతే కదు, బాబు పవన్ లలో అందరి కళ్ళూ పవన్ మీదనే ఉంటాయన్నది వాస్తవం.

ఇక ఈ ఇద్దరి జోడీ కూడా భలే ముచ్చటగా సాగుతోంది. పొలిటికల్ గా ఎంతో సీనియర్ అయినా కూడా చంద్రబాబు పవన్ ని తన పక్కన ఉంచుకుని తగినంత గౌరవం ఇస్తున్నారు. అది రీసెంట్ గా ఒక మీటింగులో పవనే చెప్పారు. ఇక బాబు అనుభవానికి పెద్దరికానికి ఎంతో రెస్పెక్ట్ ఇస్తున్నారు పవన్. ఈ విధంగా ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా ఈ ఇద్దరి సారధ్యంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతుంది.

ఇది రాజకీయాలలోనే ఒక పెద్ద విశేషంగా చెప్పుకోవాలి. ఎందుకంటే రెండు పార్టీలు ఎక్కడైనా కలిసి ఎన్నికల్లో పోటీ వరకూ చేసినా అధికారం పంచుకునే విషయంలో పొరపొచ్చాలు వస్తాయి. ఎక్కడో ఒకచోట అలకలు కోపాలు తాపాలూ వస్తాయి. కానీ పవన్ బాబు ల మధ్య ఉన్న అతి పెద్ద అండర్ స్టాండింగ్ మాత్రం దేశ రాజకీయాల్లోనే రికార్డు అని చెప్పాలి.

ఈ ఇద్దరినీ చూసిన వారు ఒకే పార్టీ ఒకే ఐడియాలజీ అని అనుకున్నా తప్పేమి లేదు. అంతలా పాలూ నీళ్లలా కలసి పోయి ఏపీ డెవలప్మెంట్ నే టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇక పవన్ విషయానికి వస్తే ఆయన దూకుడు బాగానే పెంచుతున్నారు. ఆయన మొదటి అంటే ఉప ముఖ్యమంత్రిగా అయిన తొలినాళ్ళలో కేవలం సమీక్షలకే పరిమితం అయ్యేవారు.

రోజంతా ఆయన సమీక్షలు చేస్తూ వచ్చేవారు. అలా తన శాఖల మీద పూర్తి పట్టు సాధించిన పవన్ ఇపుడు క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తున్నారు. ఆయన వరసబెట్టి చేస్తున్న ఈ టూర్లతో కూటమిలో బాగా ఎక్కువగా ఫోకస్ అవుతున్నారు సీజ్ ది షిప్ అంటూ కాకినాడలో సముద్రగర్భంలో బిగ్ సౌండ్ చేసినా మన్యంలో కిలోమీటర్లు నడచి మరి గిరిజనంతో మమేకం అయినా పవన్ గ్రేట్ అనిపించుకుంటున్నారు.

అలా ఆయన ఎక్కువగా కూటమిలో హైలెట్ అవుతూ తనదైన బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకుంటున్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రి పదవికే వన్నె తెస్తున్నారు. ఉప ముఖ్యమంత్రులు అంటే ఉత్సవ విగ్రహాలు కారు అని పవన్ తీరు రుజువు చేస్తోంది. ఇక క్విక్ గా డెసిషన్స్ తీసుకునే పాలకుడిగా కూడా ఆయన ఉంటున్నారు. అంతే కాదు అవినీతి అక్రమాల విషయంలో ఎక్కడా స్పేర్ చేసేది లేదని ప్రాక్టికల్ గా పవన్ రుజువు చేస్తున్నారు.

మాజీ సీఎం జగన్ కి సంబంధించిన సరస్వతి పవర్ ప్రాజెక్ట్ భూములను స్వయంగా సందర్శించి అక్కడ కొంత భూమి ప్రభుత్వానికి చెందినది అని పవన్ చూపించి వచ్చారు. అంతే కాదు వైసీపీ హయాంలో ఏమైనా అవినీతి అవకతవకలు జరిగితే ఏ మాత్రం ఉపేక్షించేది లేదని ఆయన కొరడా ఝళిపిస్తున్నారు. లేటెస్ట్ గా ఆయన వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి భూ కబ్జా చేశారు అన్న వార్తల విషయంలోనూ సీరియస్ యాక్షన్ కి ఆదేశాలు ఇచ్చారు అని అంటున్నారు. అంతే కాదు కడపలో ఎంపీడీవో మీద వైసీపీ నేత ఒకరు దాడి చేశారు అన్న వార్త వచ్చిన మరుక్షణం అక్కడ వాలిపోయారు. ఉద్యోగుల భద్రతకు గట్టి భరోసా ఇవ్వడమే కాకుండా వైసీపీకి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఇలా పవన్ కళ్యాణ్ తనదైన పనితీరుతో దూసుకుని పోతున్నారు. దాంతో ముఖ్యమంత్రి హోదాలో బాబు తేలిపోతున్నారు అని అంటున్నారు. స్పీడ్ గా డెసిషన్స్ తీసుకోవడంలో కానీ వైసీపీ నేతల మీద యాక్షన్ విషయంలో కానీ బాబు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. అదే పవన్ అయితే రెడీ అంటున్నారు

ఇక చంద్రబాబు అయితే సీఎం గా క్షేత్ర స్థాయిలో ఎక్కువగా పర్యటించ లేకపోతున్నారు. ఆయన నెలలో ఒకసారి సామాజిక పెన్షన్ పంపిణీలో మాత్రమే కనిపిస్తున్నారు. ఆయన ఫోకస్ అంతా అమరావతి, పోలవరం మీదనే ఉంది. ఆయన ఎక్కువగా అభివృద్ధి మీద దృష్టి పెడుతూ ఏపీలో పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బాబు చేస్తున్న ఈ కృషి అంతా తెర వెనక ఎక్కువగానే ఉంది. కానీ ఆయన తెర ముందుకు రాలేనంత బిజీగా ఉన్నారు.

దాంతో ఈ సమయంలో పవన్ గ్రౌండ్ లెవెల్ లో తిరుగుతూ ఫుల్ గా హైలెట్ అవుతున్నారు అలా ఆయన తానే సీఎం అన్నట్లుగా తన దూకుడుగా జనంలో కనిపిస్తున్నారు. మరి చంద్రబాబు కోరి ఈ విధంగా పవన్ ని జనంలోకి పంపుతూ తాను ప్రభుత్వ వ్యవహారాలకు పరిమితం అవుతున్నారా లేక నిజంగానే బాబు దూకుడు తగ్గించేశారా అన్న చర్చ అయితే ఉంది. ఏది ఏమైనా బాబు మొదటి నుంచి చూస్తే ప్రత్యర్థుల మీద రాజకీయ కక్షలకు దూరంగా ఉంటారు. అయితే పవన్ మాత్రం టిట్ ఫర్ టాట్ అన్న సూత్రాన్ని అనుసరిస్తూ కరెంట్ జనరేషన్ ని ఎట్రాక్ట్ చేస్తున్నారు. మొత్తానికి ఇది ఇపుడు చర్చగా ఉంది.

Tags:    

Similar News