క్లాస్ రూంలో విద్యార్థితో మహిళా ప్రొఫెసర్ పెళ్లి.. స్కిట్ కోసమేనా?
ఈ కాలేజ్ అబ్దుల్ కలాం అజాద్ వర్సిటీ పరిధిలోకి వస్తుంది. కాలేజీలో సైకాలజీ ప్రొఫెసర్ గా పని చేసే పాయల్ బెనర్జీ.. తన విద్యార్థిని పెళ్లి చేసుకున్నట్లుగా ఈ వీడియోలో ఉంది. పెళ్లి కుమారుడు మొదటి సంవత్సరం చదివే విద్యార్థిగా చెబుతున్నారు.
ఒక వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థితో ఒక మహిళా ప్రొఫెసర్ పెళ్లి జరగటం.. అది కూడా క్లాస్ రూంలో కావటం పెద్ద రచ్చగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వెలుగు చూసింది. ఈ వీడియోను చూసిన వారు ఎవరైనా.. వారిద్దరి మధ్య నిజంగానే పెళ్లి జరిగిందన్నట్లుగా క్రతువు నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా ఎలా అయితే పెళ్లి చేసుకుంటారో అలానే అన్ని కార్యక్రమాల్ని నిర్వహించిన వైనం వీడియోలో కనిపిస్తోంది. గుర శిష్యుల మధ్య ఉండే పవిత్ర బంధానికి భిన్నంగా ఈ వీడియో ఉండటంతో విమర్శలు వెల్లువెత్తాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాకు 150 కిలోమీటర్ల దూరంలోని నదియాలో ఉండే హరిన్ ఘటా టెక్నాలజీ కాలేజీలో ఈ ఘటన జరిగింది.
ఈ కాలేజ్ అబ్దుల్ కలాం అజాద్ వర్సిటీ పరిధిలోకి వస్తుంది. కాలేజీలో సైకాలజీ ప్రొఫెసర్ గా పని చేసే పాయల్ బెనర్జీ.. తన విద్యార్థిని పెళ్లి చేసుకున్నట్లుగా ఈ వీడియోలో ఉంది. పెళ్లి కుమారుడు మొదటి సంవత్సరం చదివే విద్యార్థిగా చెబుతున్నారు. గ్రీన్ కలర్ కుర్తా వేసుకున్న ఇతను.. సదరు మహిళా ఫ్రొఫెసర్ నుదిటి మీద సిందూరం దిద్దటంతో పాటు.. అగ్ని చుట్టూ ఏడు అడుగులు తిరగటానికి బదులుగా.. క్యాండిల్ చుట్టూ తిరగటం.. పెళ్లి చేసుకున్న మహిళా ప్రొఫెసర్.. పెళ్లి దుస్తుల్ని ధరించి.. చేతులకు నిండుగా గోరింటాకు పెట్టుకొని..మెడలో పూల దండ వేసుకొని అచ్చం పెళ్లి కుమార్తె మాదిరి సిద్ధమయ్యారు. హల్దీ వేడుకల్ని సైతం విద్యార్థుల సమక్షంలో క్లాస్ రూంలోనే భారీగాజరిపినట్లుగా వీడియోలో ఉంది.
దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావటం ఒక ఎత్తు అయితే.. ఈ పెళ్లి మొత్తం ఒక ఈవెంట్ గా.. ఇదో కల్చరల్ ప్రోగ్రాం మాదిరి చెప్పటం గమనార్హం. దీంతో అప్రమత్తమైన వర్సిటీ అధికారులు ఈ అంశంపై అంతర్గత విచారణను నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ పాయల్ స్పందిస్తూ.. అది నిజమైన పెళ్లి కాదని.. సరదా కోసం చేసిన ప్రయత్నంగా చెబుతున్నారు. విద్యార్థులు తనను రిక్వెస్టు చేయటంతో తాను అంగీకరించారని.. తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసే క్రమంలో ఈ వీడియోను బయట పెట్టారని.. ఆ పని చేసిన వారిని తాను గుర్తించానని.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లుగా చెప్పారు. వీడియోలో ఉన్న విద్యార్థి మాత్రం స్పందించలేదు.
సైకలాజికల్ డ్రామాలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తప్పుడు పద్దతుల్లో ప్రచారం చేసేందుకు వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఆమె వివరణకు వర్సిటీ అధికారులు ఏకీభవించలేదని తెలుస్తోంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ కోసం ముగ్గురితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారని చెబుతున్నారు. నివేదిక వచ్చే వరకు మహిళా ఫ్రొఫెసర్ ను సెలవు మీద పంపుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశం మీద విద్యార్థులు ఎవరూ స్పందించటం లేదు.