లైంగిక వేధింపుల వ్యవహరం... అత్యంత సంపన్న వ్యక్తిపై 421 మంది మహిళల ఫిర్యాదు!
బ్రిటన్ లోని అత్యంత సంపన్న కుటుంబాల్లో హారోడ్స్ డిపార్ట్ మెంటల్ స్టోర్ యజమాని మహమ్మద్ అల్ ఫాయిద్ ఒకరు.
బ్రిటన్ లోని అత్యంత సంపన్న కుటుంబాల్లో హారోడ్స్ డిపార్ట్ మెంటల్ స్టోర్ యజమాని మహమ్మద్ అల్ ఫాయిద్ ఒకరు. ఈయన గత ఏడాది 94 ఏళ్ల వయసులో మరణించారు. మహమ్మద్ అల్ ఫాయిద్.. హారోడ్స్ ను 1985లో కొనుగోలు చేశాడు. ఆ సంగతి అలా ఉంటే.. ఇతడు సుమారు 400 మందికిపైగా మహిళలను లైంగికంగా వేదించాడని యూకే లాయర్లు తాజాగా వెల్లడించారు.
అవును... బ్రిటన్ లో నివశించిన ఈజిప్ట్ బిలియనీర్ మహమ్మద్ అల్ ఫాయిద్ తన జీవితకాలంలో సుమారు 400 మందికి పైగా మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని యూకే లాయర్లు వెల్లడించారు. ఈ విషయం ఇప్పుడు తెరపైకి రావడానికీ బలమైన కారణం బీబీసి అని అంటున్నారు.
వాస్తవానికి సెప్టెంబర్ బీబీసీ అల్ ఫాయిద్ అత్యాచారాలపై ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది. అక్కడ నుంచి అల్ ఫాయిద్ బాధితురాళ్లు మెల్లగా ఒక్కొక్కరుగా ముందుకురావడం మొదలైంది. ఈ నేపథ్యంలో.. "ది జస్టిస్ ఫర్ హారోడ్స్ సర్వైవర్స్ గ్రూప్" సంస్థను ఇప్పటివరకూ 421 మంది మహిళలు ఆశ్రయించారని చెబుతున్నారు.
సుమారు 30 ఏళ్ల పాటు అతడు.. స్టోర్ కు సంబంధించిన మహిళలు, ఫల్ హోం ఫుట్ బాల్ క్లబ్, పారిస్ లోని రిట్జ్ హోటల్ ఇతర సంస్థలకు చెందిన మహిలలపై లైంగిక దాడులు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ సందర్భంగా స్పందించిన న్యాయవాదులు... అల్ ఫాయిద్ చేసిన అరాచకాలకు చుట్టుపక్కల ఉన్నవారు సహకరించారని చెబుతున్నారు.
ఈ విషయంలో మహమ్మద్ బాధితుల్లో యూకేకి చెందిన వారు ఎక్కువగా ఉన్నప్పటికీ... ప్రపంచం నలుమూలల నుంచి పలువురు తమను సంప్రదించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో తన చుట్టుపక్కల ఉన్న దాదాపు ప్రతీ యువతినీ అల్ ఫాయిద్ టార్గెట్ చేసి ట్రై చేసేవాడని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే "ది జస్టిస్ ఫర్ హారోడ్స్ సర్వైవర్స్ గ్రూపు" నుంచి చట్టపరమైన చర్యలు మొదలయ్యాయని.. వందలకొద్దీ లెటర్ ఆఫ్ క్లెయింస్ హారోడ్స్ కు త్వరలో వెళతాయని లాయర్లు చెబుతున్నారు. ఇదే సమయంలో మరికొంతమంది బాధితురాళ్లు కోర్టు బయటే సెటిల్మెంట్ చేసుకొనేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.