ఆ ఊర్లో 50% మంది కవలలే... తినే ఆహారం ఏమిటంటే..?
అవును... నైజీరియా నైరుతి ప్రాంతంలోని ఓ ఊళ్లో ఎక్కడ చూసినా కవలలే కనిపిస్తుంటారు. ఒకే రకమైన దుస్తులు, చెప్పులు ధరించి ఒకే హైట్ లో ఇద్దరిద్దరు చొప్పున కనిపిస్తారు!
సాధారణంగా జంట అరటి పండ్లు (ఒకదానినొకటి అంటిపెట్టుకుని ఉండే) తింటే కవల పిల్లలు పుడతారని కొన్ని గ్రామాల్లో మూఢనమ్మకం! కొన్ని చోట్ల ఇది సరదా వ్యాఖ్యానం! ఆ సంగతి అలా ఉంటే... సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ 100 ప్రసవాల్లోనూ 12% కవలను ఉంటారు. కానీ.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఊర్లో మాత్రం 50% మంది ఉంటారు!
అవును... నైజీరియా నైరుతి ప్రాంతంలోని ఓ ఊళ్లో ఎక్కడ చూసినా కవలలే కనిపిస్తుంటారు. ఒకే రకమైన దుస్తులు, చెప్పులు ధరించి ఒకే హైట్ లో ఇద్దరిద్దరు చొప్పున కనిపిస్తారు! ఆ ఊరి పేరే ఇగ్బో-ఓరా. ఈ ఊరు కవల పిల్లలకు ప్రసిద్ధి. ఇక్కడవారికి నూటికి సగం మంది కవల పిల్లలే జన్మిస్తారని ఆసుపత్రుల రికార్డులు చెబుతున్నాయి.
ఇక ఇక్కడ పుట్టిన కవలల్లో ముందు పుట్టినవారికి "తైవో" అని.. తర్వాత పుట్టినవారికి "కెహిండే" అని పేరు పెడతారు. ఇందులో తైవో అంటే.. 'ముందుగా ప్రపంచాన్ని అనుభూతి చెందిన' అని అర్ధం కాగా.. కెహిండే అనగా... 'తర్వాత ఈ లోకానికి వచ్చినవారు' అని అర్ధం అని చెబుతుంటారు.
ఇక ఇక్కడి ప్రజలు ఆహారంలో బెండ ఆకుతో చేసిన ఒక రకమైన సూప్ ను తీసుకుంటారు. ఇదే సమయంలో.. యమ్ అనే దుంపతో చేసిన పిండినీ వాడుతుంటారని చెబుతారు. అయితే.. వీరి ఆహారానికీ ఇలా కవలలు పుట్టడానికి ఏమీ సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇక్కడ ఏటా వరల్డ్ ట్విన్ ఫెస్టివల్ ని నిర్వహిస్తుంటారు.
ఈ క్రమంలో ఈ ఏడాది ఫెస్టివల్ మొదలైంది. ఈ ఫెస్టివల్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు, టాలెంట్ షోలు నిర్వహిస్తారు. ఈ ఫెస్టివల్ నిర్వాహకులు కూడా కవలలే కావడం గమనార్హం. ఈ సందర్భంగా స్పందించిన ఓయో స్టేట్ గవర్నర్... దేశంలో టూరిజంను ప్రోత్సహించేందుకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు సాధించేదుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు.
కాగా... కారణం ఏమైనప్పటికీ ఇక్కడ ప్రతీ ఒక్కరూ కవలల సమృద్ధిని ఒక ఆశీర్వాదంగా అంగీకరిస్తారు. తమకు కవలను జన్మించడం సర్వోన్నత దేవుని బహుమతిగా చూస్తారు.