ఆరు మంది వైసీపీ మాజీ మంత్రులు జంప్ ?

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు అయిన వైసీపీలో సంక్షోభం కొనసాగుతూనే ఉంది.

Update: 2024-11-09 11:30 GMT

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు అయిన వైసీపీలో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. పార్టీ అధికారంలో ఉన్నపుడు వేయి ఏనుగుల బలంతో కనిపించేది. పార్లమెంట్ నుంచి పంచాయతీ వార్డు మెంబర్ దాకా ఎక్కడ చూసినా వైసీపీ వేరే అన్నట్లుగా ఉండేది. వైసీపీలో ఎన్నో గొంతుకలు కూడా ఉండేవి.

బలమైన నాయకులతో వైసీపీకి తిరుగేలేదు అన్నట్లుగా పరిస్థితి కనిపించేది. ఎపుడైతే వైసీపీ భారీ ఓటమిని మూటకట్టుకుందో ఆనాటి నుంచి వైసీపీకి ఎడ తెగని కష్టాలు మొదలయ్యాయి. వైసీపీలో ఎవరు ఉన్నారో ఎవరు లేరో కూడా తెలియని పరిస్థితి. వైసీపీకి వీరు ఉన్నారు కొండంత అండగా అని అధికారంలో ఉన్నపుడు చెప్పుకున్న వారంతా ఇపుడు చడీ చప్పుడూ చేయడం లేదు.

అంతే కాదు,వారి అయిపూ అజా కూడా తెలియడం లేదు. వారి మనసులో ఏముంది అన్నది కూడా ఎవరికీ అంతు బట్టడం లేదు. ఈ నేపధ్యంలో వైసీపీలో నుంచి బయటకు వెళ్లేవారు కూడా చాలా మంది కనిపిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది వివిధ కారణాలు చెప్పి పార్టీని వీడిపోయారు. ఇపుడు మరింత మంది అదే బాటలో పయనిస్తున్నట్లుగా ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.

మరో వైపు చూసుకుంటే వైసీపీలో దిగ్గజ నేతలుగా ఒకనాడు చెప్పుకునే వారు అంతా పార్టీని వీడిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్న వార్తలు పుకార్లుగా షికారు చేస్తున్నారు. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు మాజీ మంత్రులు వైసీపీ గేటు దాటనున్నారు అన్నది తాజాగా వైరల్ అవుతున్న మరో న్యూస్ ఎందుకు ఇలా జరుగుతోంది, అసలు వైసీపీకి ఏమి జరిగింది. ఏమి జరగబోతోంది అన్నది కనుక చూస్తే చాలా ఆసక్తిని పెంచేలాగానే సంఘటనలు జరుగుతున్నాయి.

వైసీపీలో ఆరుగురు మాజీ మంత్రులు ఏకంగా బీజేపీలోకి జంప్ చేస్తారు అని టాక్ అయితే నడుస్తోంది. వీరంతా మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ దెబ్బకు హడలిపోతున్నారు అని అంటున్నారు. రెండు బుక్ లో ఇప్పటికి రెండు చాప్టర్లు పూర్తి అయ్యాయి, మూడవ చాప్టర్ తెరుస్తామని ఇటీవలే లోకేష్ అమెరికా టూర్ లో చెప్పారు.

దాంతో రెడ్ బుక్ లో మూడవ చాప్టర్ లో చాలామంది బిగ్ షాట్స్ వైసీపీకి చెందిన మాజీ మంత్రుల పేర్లు ఉన్నాయని కూడా అంటున్నారు. దాంతో వారంతా వణుకుతున్నారు అని అంటున్నారు. ఇక ఇటీవల చూస్తే ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ చేసిన కామెంట్స్ తో కూటమి ప్రభుత్వంలో ఒక రకమైన ప్రకంపనలు వచ్చాయి.

ఆ మీదట చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో భేటీ వేసి ఆయనకు ఏమి కావాలో చేస్తామని చెప్పారని కూడా వార్తలు వచ్చాయి. ఇక పవన్ కళ్యాణ్ అయితే వైసీపీ నేతలను ఏ మాత్రం స్పేర్ చేయకూడదని పట్టుదలగా ఉన్నారని అంటున్నారు. గతంలో టీడీపీని జనసేన నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఇబ్బందులు పెట్టిన వారిని అందరినీ అరెస్ట్ చేసి జైలు మార్గమే చూపించాలని జనసేన గట్టి నిర్ణయంతో ఉందని అంటున్నారు.

దానికి తగినట్లుగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు చకచకా సాగిపోతున్నాయి. ఇపుడు బిగ్ షాట్స్ ని కూడా టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు. ఆ వరసలో వైసీపీ లో మంత్రులుగా పనిచేసి టీడీపీ జనసేన మీద బిగ్ సౌండ్ తో విరుచుకుపడిన వారందరి మీద కన్ను ఉందని అంటున్నారు.

ఇక ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పవన్ కలసినపుడు కూడా ఏపీలో జరుగుతున్న అంశాలు అన్నీ ఆయనకు వివరించారని చెబుతున్నారు. దాంతో ఆయన కూడా పవన్ కి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని అంటున్నారు.

ఇక ఇపుడు జనసేన టీడీపీ సరికొత్త గేమ్ స్టార్ట్ చేశాయని అంటున్నారు. వైసీపీ ఏలుబడిలో అక్రమంగా ఆస్తులు సంపాదించిన పలువురు మాజీ మంత్రుల విషయంలోనే గట్టి టార్గెట్ ఉంటుందని అంటున్నారు. దీంతో విషయం పసిగట్టిన ఆరుగురు వైసీపీకి చెందిన మాజీ మంత్రులు బీజేపీలోకి జంప్ చేయడం ద్వారా తమను తాము రక్షించుకోవడానికి చూస్తున్నారు అని అంటున్నారు.

ఈ మేరకు వీరంతా బీజేపీ పెద్దలకు టచ్ లోకి వెళ్లారు అని అంటున్నారు. ఈ క్రమంలో వీరిని చేర్చుకునే విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా సుముఖంగా ఉందని అంటున్నారు. వీరిని ఢిల్లీ పిలిపించి ఒకేసారి కమలం పార్టీ కండువాలు కప్పించే కార్యక్రమం చేపడతారు అని అంటున్నారు.

ఈ మేరకు రాష్ట్ర బీజేపీ శాఖకు కూడా ఇప్పటికే ఈ సమాచారాన్ని అందించారని అంటున్నారు. మరి ఈ ఆరుగురు మాజీ మంత్రులు ఎవరు ఏమిటి ఆ కధ అంటే వీరిలో ఎక్కువ మంది కోస్తా జిల్లాలకు చెందిన వారు ఉన్నారని అంటున్నారు. గతంలో వైసీపీ నుంచి పెద్ద గొంతుక చేసి విమర్శలు చేసిన వారిలో వీరు ముందు వరసలో ఉంటారని అంటున్నారు. వీరు కనుక వైసీపీని వీడితే ఆ పార్టీకి భారీ దెబ్బ పడుతుందని అంటున్నారు. ఈ సంచలన వార్త కోసం అంతా ఇపుడు ఎదురు చూస్తున్నారు అంటున్నారు.

Tags:    

Similar News