పెద్దిరెడ్డి, రోజా.. ఆంబోతుల్లా రంకెలు అనేసారేంటి..?

తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందడం చరిత్రలోనే తొలిసారని వైసీపీ మండిపడుతున్న సంగతి తెలిసిందే

Update: 2025-01-11 04:24 GMT

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెట్ల విక్రయ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట పెను విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఈ ఘటలో ఆరుగురు మృతి చెందగా.. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. వీరిలో కొంతమంది ఇప్పటికే డిశ్చార్జ్ అయినట్లు చెబుతుండగా.. ఇంకా చాలా మంది చికిత్స పొందుతున్నారని అంటున్నారు.

ఈ సమయంలో.. ఇప్పటికే క్షతగాత్రులను ప్రభుత్వ పెద్దలతో పాటు మాజీ సీఎం జగన్ పరామర్శించారు. మరోపక్క మాజీ నేతలు వెళ్లి పరామర్శించి వస్తున్నారు. మరోపక్క ఈ వ్యవహారం తీవ్రస్థాయిలో రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇప్పటికే పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పడం, టీటీడీ ఛైర్మన్ కూడా చెప్పాలని కోరడం హట్ టాపిక్ గా మారింది.

అయితే... క్షమాపణలు చెప్పాలని కోరడంలో తప్పులేదు కానీ.. క్షమాపణలు చెప్పినంతమాత్రాన్న పోయినవారు తిరిగి వస్తారా అంటూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో వైసీపీ నేతలు, మాజీ మంత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించడానికి వెళ్లారు.

ఈ సమయంలో... తిరుమలకు వచ్చే భక్తుల భద్రతా, సౌకర్యాల కల్పన విషయంలో ప్రభుత్వం, దేవస్థానం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందంటూ విమర్శలు చేశారు! ఈ సమయంలో నినాదాలు చేసుకుంటూ ఆస్పత్రి ప్రాంగణానికి చేరుకున్నారు! ఈ సమయంలో... లోపల ఐసీయూలో క్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఉంటారనే ఇంగితం లేకుండా నినాదాలు చేస్తున్నారంటూ టీడీపీ ఫైర్ అయ్యింది.

అవును... తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందడం చరిత్రలోనే తొలిసారని వైసీపీ మండిపడుతున్న సంగతి తెలిసిందే.. ఇది పూర్తిగా ప్రభుత్వ బాధ్యతా రాహిత్యమే అని.. ఇవి ప్రభుత్వం చేసిన హత్యలే అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సమయంలో ఆస్పత్రిలో ఉన్న క్షతగాత్రులను పరామర్శించడానికి వెళ్లారు వైసీపీ నేతలు.

ఈ సమయంలో వారంతా నినాదాలు చేసుకుంటూ వెళ్లడంపై టీడీపీ ఎక్స్ వేదికగా సీరియస్ గా మండిపడింది. ఇందులో భాగంగా.. "ఆస్పత్రి ప్రాంగణంలో ఆంబోతుల్లా రంకెలు వేసుకుంటూ వెళ్తున్న వీళ్లు ఎవరో గుర్తుపట్టారా?" అని మొదలుపెట్టిన టీడీపీ... వీరు ఆరు నెలల కిందటి వరకూ మంత్రుల్లుగా పనిచేసిన ఆర్కే రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని తెలిపింది.

ఇదే సమయంలో... వీళ్లతో పాటు గతంలో టీటీడీ ఛైర్మన్లుగా, ఎమ్మెల్యేలుగా పని చేసినవాళ్లూ ఉన్నారని చెబుతూ... ఆస్పత్రి ప్రంగణంలో నిశ్శబ్ధంగా ఉండటం అటుంచి వీధిరౌడీల్లా కేకలు వేసుకుంటూ వెళ్తున్నారు.. అది కూడా అత్యంత క్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో బాధపడే వారుండే ఐసీయూవద్ద అని వెల్లడించింది.

ఈ సందర్భంగా ఈ మూకల దాడిలో వైద్య పరికరాలు కూడా ధ్వంసమయ్యాయని తెలిపింది. అనంతరం... ఆస్పత్రిలో చికిత్స పోందుతున్న వారి దగ్గరకు వెళ్లి ఈ నినాదాలు ఏమిటి? ఈ సైకోలను ఏమనాలి? అంటూ ఘాటుగా స్పందించింది.

ఈ సమయంలో “అసలు అంతమందిని అక్కడకు ఎలా అనుమతించారు” అనేది ఇప్పుడు ఆన్ లైన్ వేదికగా వినిపిస్తున్న ప్రశ్న కావడం గమనార్హం!

Tags:    

Similar News