వేచి చూస్తున్న వైసీపీ.. వేగలేకున్న నాయకులు.. సీరియస్ మ్యాటర్...!
కానీ, వైసీపీలో మాత్రం అధినేత జగన్.. వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. గతంలో పాలన సమయంలోనూ నాయకులు విజృంభిస్తున్నారనే వార్తలు వచ్చినా.. ఆయన కదలలేదు.
పార్టీలు మారేవారు మారుతున్నారు. ఉండే వారు ఉంటున్నారు. మరికొందరు ఏకంగా రాజకీయాలకే దూర మవుతున్నారు. వెరసి వైసీపీ నాయకులు.. తర్జన భర్జనలో పడుతున్నారు. పోతున్నవారిని ఆపే వారు లేరు. పోనీ.. ఎవరైనా కొత్తగా వస్తున్నారా? అంటే.. అది కూడా కనిపించడం లేదు. ఇప్పటికే కీలక నాయకులు వెళ్లిపోయారు. ఇక, నాయకులు పోయినా.. క్షేత్రస్థాయిలో కేడర్ బలంగా ఉందన్న ధీమా ఉందని అనుకుంటే.. అది కూడా ఇప్పుడు కదలబారి పోతోంది.
ఎక్కడికక్కడ మునిసిపాలిటీలు కూటమి పరం అవుతున్నాయి. నాయకులు జెండాలు మార్చేస్తున్నారు. తాజాగా కీలకమైన కమలాపురం మునిసిపాలిటీ కూడా కూటమి పరమైపోయింది. ఈ పరిణామాలను చూస్తుంటే.. ఏ పార్టీ అయినా.. క్షేత్రస్థాయి పరిస్థితులను సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తుంది. వెంటనే కార్యాచరణను కూడా ప్రారంభిస్తుంది. కానీ, వైసీపీలో మాత్రం అధినేత జగన్.. వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. గతంలో పాలన సమయంలోనూ నాయకులు విజృంభిస్తున్నారనే వార్తలు వచ్చినా.. ఆయన కదలలేదు.
ఇదంతా విపక్షాలకుట్ర అంటూ తాడేపల్లికి పరిమితమయ్యారు. మంచి కోరుకున్న సోషల్ మీడియా జనా లపైనా కేసులు పెట్టి వేధించారు. చివరకు ఇప్పుడు మంచి చెప్పేవారు కూడా కనిపించడంలేదు. అంతే కాదు.. కూటమి సర్కారు తప్పులు చేస్తోందని తెలిసినా.. ఎవరూ నోరు విప్పడం లేదు. అలాంటప్పుడు వైసీపీ సోషల్ మీడియా అయినా.. యాక్టివ్‌గా ఉందా? అంటే అది కూడా లేదు. మరి ఈ పరిణామాలను ఎలా చూడాలి? ఏవిధంగా జగన్ అర్ధం చేసుకోవాలనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నారు.
కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం వైసీపీ నాయకులు అవకాశం కోసం ఎదరు చూస్తున్నారన్నది మాత్రం వాస్త వం. అయితే.. ఈ విషయాన్ని గ్రహించడంలో జగన్ విఫలమయ్యారు. ఇప్పుడున్నది పార్టీని లైన్‌లో పెట్టు కోవడంకంటే.. ఉన్నవారిని కాపాడుకోవడం అనేది కీలక పరిణామం. మరి ఆదిశగా జగన్ అడుగులు వేస్తారో.. లేదా.. వేచి చూస్తారో.. చూడాలి. ఏదేమైనా ఇప్పటికేచేతులు కాలిపోయాయన్నది మాత్రం వాస్తవం అంటున్నారు పరిశీలకులు.