వైసీపీ తాజా జాబితాతో కొత్త లెక్క..!

ఈ జాబితాతో కొత్త లెక్క కనిపిస్తోంది. గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేయడానికి కిలారి రోశయ్యను ఎంపిక చేశారు.

Update: 2024-02-28 17:23 GMT

వైసీపీ తాజాగా మరో జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాతో కొత్త లెక్క కనిపిస్తోంది. గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేయడానికి కిలారి రోశయ్యను ఎంపిక చేశారు. దాని కోసం ఆయనను ఇంచార్జిగా నియమించారు. అలాగే ఒంగోలు పార్లమెంట్ సీటుకు ఇంచార్జిగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని రంగంలోకి దించారు. దీని బట్టి చూస్తే ఆయన అక్కడ ఎంపీగా పోటీ చేస్తారు అన్న మాట.

 

అలాగే ఇక కిలారి రోశయ్య ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పొన్నూరు సీటు నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన అంబటి మురళిని ఇంచార్జిగా చేశారు. ఆయన అక్కడ పోటీ చేస్తారు అని భావించాలి. అలాగే కందుకూరుకు ఇంచార్జిగా బుర్రా మధుసూధన్ యాదవ్ ని నియమించారు. ఇక్కడ మహీధర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటున్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయను అని ఆయన డిసైడ్ అయ్యారు. దాంతో అక్కడ ఈయనని షిఫ్ట్ చేశారు.

బుర్రా ప్రస్తుతం కనిగిరి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటున్న సంగతి విధితమే. ఇక చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు ఇంచార్జిగా కల్లత్తూరు కృపాలక్షిమిని నియమించారు. ఈ సీటులో ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి ఉన్నారు. ఆయన కుమార్తెకు టికెట్ ఇచ్చారు. ఈ సీటు విషయంలో ఆయన పోరాడి సాధించుకున్నట్లు అయింది అని అంటున్నారు.

Tags:    

Similar News