దేశం దాటిన హర్షసాయి.. వారి కోసం పోలీసుల గాలింపు

ఆపరేషన్.. హర్షసాయి కొనసాగుతూనే ఉంది. లైంగికదాడి, బ్లాక్‌మెయిలింగ్ కేసులో ఇరుక్కున్న ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కేసు నమోదు నుంచి పరారీలోనే ఉన్నారు

Update: 2024-10-06 08:34 GMT

ఆపరేషన్.. హర్షసాయి కొనసాగుతూనే ఉంది. లైంగికదాడి, బ్లాక్‌మెయిలింగ్ కేసులో ఇరుక్కున్న ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కేసు నమోదు నుంచి పరారీలోనే ఉన్నారు. ఇప్పటికే ఆయనపై లుక్అవుట్ నోటీసులు సైతం జారీ చేసిన పోలీసులు.. ఆయన ఆచూకీ కోసం తిరుగుతున్నారు.

ఇక హర్షసాయి కేసులో రోజుకో ట్విస్ట్ కనిపిస్తోంది. ఇప్పటికే ఓ సినిమా ప్రమోషన్ కోసమని తనను లైంగికంగా వేధించడమే కాకుండా.. తన నుంచి రూ.2 కోట్లు తీసుకున్నాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తరువాత అదే యువతి.. తనను సోషల్ మీడియా ద్వారా వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని మరోసారి ఫిర్యాదు చేసింది. దాంతో మరో కేసు నమోదు చేశారు. ఇక రెండు రోజుల క్రితం హర్షసాయి విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందంటూ మరోసారి నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. అతడిని అడ్డుకోవాలని కోరింది.

తాజాగా.. ఇదే అంశంపై బాధితురాలి లాయర్ నాగూర్‌బాబు మీడియాతో మాట్లాడారు. నిందితురాలికి డీఫేమ్ తీసుకొచ్చేలా హర్షసాయి, అతని మనుషులు రిలీజ్ ఫ్యాబ్రికేటెడ్ ఆడియోలపై కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. అన్ని పార్మాట్ల నుంచి వాటిని తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం పలు సెక్షన్ల కింద పలువురిపై కేసు నమోదు అయిందని ఆయన వెల్లడించారు. తన క్లయింట్‌పై ఆర్థిక లావాదేవీల అంశంపై హర్షసాయి ప్లాన్ ప్రకారమే ఆరోపణలు చేస్తున్నారని, కేసులో ఇంతవరకు అతడిని నిందితుడిగా చేర్చకపోయినా అతని తండ్రి బెయిల్ కోసం ప్రయత్నించిన విషయాన్ని ప్రస్తావించారు. దీంతో అతడిని కోర్టు మందలించిందన్నారు. మరోవైపు.. ఇంతవరకు హర్షసాయి మీద ఏ కేసు నమోదు అయిందని ఎవరికీ తెలియదు. కానీ.. ప్రస్తుతం హర్షసాయి మాత్రం దేశం వదిలి పారిపోయాడనే ప్రచారమైతే బలంగా జరుగుతోంది.

ఇప్పటికే పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన క్రమంలో.. అతని అరెస్ట్ తప్పదని లాయర్ వెల్లడించారు. అయితే బాధితురాలు ఇటీవల మాట్లాడిన ఆడియో అంటూ హర్షసాయికి అనుకూలంగా కొంతమంది ప్రచారం చేయడం ప్రారంభించారు. దీంతో వారికోసం కూడా పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News