దసరా బరిలోకి జగన్ చంద్రబాబు.. రచ్చే మరి...!

ఈసారి దసరా మామూలుగా ఉండదు, రాజకీయ దసరా గానే ఉంటుంది. ఎందుకంటే ఈసారి దసరాను టార్గెట్ గా చేసుకుని ఏపీ రాజకీయం సాగనుంది.

Update: 2023-08-20 12:34 GMT

ఈసారి దసరా మామూలుగా ఉండదు, రాజకీయ దసరా గానే ఉంటుంది. ఎందుకంటే ఈసారి దసరాను టార్గెట్ గా చేసుకుని ఏపీ రాజకీయం సాగనుంది. అటు అధికార వైసీపీ ఇటు విపక్ష టీడీపీ రెండూ దసరానే టార్గెట్ చేశాయి. దసరా అంటే విజయదశమి, 2024 ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించాలన్న ఉద్దేశ్యంతో వైసీపీ టీడీపీ దసరాను ఎంచుకున్నాయి. ఆ సెంటిమెంట్ తో పూర్తిగా తమ రాజకీయాన్ని పండించుకోవాలని చూస్తున్నాయి.

ఇక వైసీపీ విషయానికి వస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2024 ఎన్నికలలో మరోసారి ఘనవిజయం సాధించాలని రెండోసారి సీఎం గా తానే ఉండాలని భావిస్తున్నారు. అందుకోసం ఆయన తీవ్ర కసరత్తు చేతున్నారు. పదునైన వ్యూహాలను సైతం రచిస్తున్నారు. గడచిన కొంతకాలంగా ఆయన పార్టీ మీదనే ఫుల్ ఫోకస్ పెట్టేశారు.

అభ్యర్ధుల ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. గెలుపు గుర్రాలనే ఒకటికి పదిసార్లు సర్వేలు చేసి మరీ బరిలోకి దించనున్నరు అని అంటున్నారు. ఇదిలా ఉండగా వైసీపీ తొలి జాబితాను ఈ దసరాకు రిలీజ్ చేయాలని జగన్ భావిస్తున్నారు అని అంటున్నారు. తొలి జాబితాలో వర్గ పోరు లేని సీట్లు ఉంటాయని అంటున్నారు.

అలా ఎంపిక చేసే అభ్యర్ధుల జాబితాలో గన్నవరం నుంచి వల్లభనేని వంశీకి చీరాల నుంచి కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ కి టికెట్ కన్ ఫర్మ్ అని అంటున్నారు. ఈ ఇద్దరూ 2019 తరువాత టీడీపీలో గెలిచి వైసీపీలోకి వచ్చారు. దాంతో వారికి ప్రాముఖ్యత ఇస్తున్నారు అని అంటున్నారు. అలాగే జనసేన తరఫున గెలిచి వైసీపీలో చేరిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు కూడా టికెట్ ఇస్తారని అంటున్నారు.

అదే విధంగా నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డిలకు టికెట్ కన్ ఫర్మ్ చేస్తూ తొలి జాబితా ఉంటుందని అంటున్నారు. ఇక కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరిస్తూ వారి ప్లేస్ లో కొత్త వారిని ఎంపిక చేస్తారని, ఆ పేర్లు కూడా తొలి జాబితాలో ఉంటాయని అంటున్నారు.

ఆ విధంగా కనుక చూస్తే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలు దాదాపుగా 27 మందికి టికెట్లు నో అని చెబుతారని అంటున్నారు. అయితే వారిని ఆ సమాచారం ముందస్తుగా తెలియచేసి వారికి సరైన హామీ ఇవ్వడం ద్వారానే పార్టీలో ఉంచుకుంటారని అంటున్నారు. ఇక టికెట్లు దక్కని వారికి పార్టీ బాధ్యతలతో పాటు నామినేటెడ్ పదవులు కూడా ఇస్తారని తెలుస్తోంది.

ఈ విధంగా ముందస్తుగా ఎంపిక చేయడం ద్వారా అభ్యర్ధులు జనంలోకి తొందరగా వెళ్తారని ప్రజలను ఆకట్టుకుంటారని, అదే టైంలో సీటు దక్కని వారు ఏమైనా ఇబ్బంది పెట్టాలనుకున్నా వారిని సరిచెసుకునే అవకాశం ఉంటుందని కూడా పార్టీ పెద్దలు భావిస్తున్నారు. మొత్తం మీద చూస్తే జగన్ దసరాకు తొలి జాబితాను విడుదాల చేస్తారు అని అంటున్నారు. దాంతో ఎవరికి టికెట్లు దక్కుతాయన్నది వైసీపీలో తెలియక ఎమ్మెల్యేలలో అతి పెద్ద టెన్షన్ నెలకొంది.

మరో వైపు చూస్తే టీడీపీ కూడా తొలి జాబితాను దసరాకు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. దసరా నాటికి కనీసంగా యాభై మంది దాకా అభ్యర్ధులను టీడీపీ ప్రకటిస్తుంది అని అంటున్నారు. టీడీపీ సైతం వివాదాలకు తావు లేని చోట, వర్గ పోరు లేని చోటనే ఎంచి మరీ అభ్యర్ధులను ప్రకటిస్తుంది అని అంటున్నారు. టీడీపీ నాలుగు విడతలుగా మొత్తం అభ్యర్థులను విడుదల చేయాలని అనుకుంటోందని సమాచారం.

ఇక వైసీపీ కూడా మూడు నాలుగు విడతలుగా అభ్యర్ధుల జాబితాను విడుదల చేస్తూ ఈ మొత్తం ప్రక్రియను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని చూస్తోంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే అటు జగన్ ఇటు చంద్రబాబు దసరాకు బరిలోకి దిగిపోతున్నారు అనే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News