వైనాట్ 175... జనాల్లోకి జగన్... వచ్చే నెలలో మరో యాత్ర!

ఎన్నికలకు ముందు పాదయాత్రతో ప్రజల్లో ఉన్న జగన్... అధికారం వచ్చిన అనంతరం తనదైన పాలన అందించారు

Update: 2023-09-25 07:07 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పైగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం టీడీపీతో కలిసే ప్రయాణం అని జనసేన అధినేత పవన్ అధికారికంగా వెల్లడించిన తర్వాత అవి మరింత రసవత్తరంగా మారాయని అంటున్నారు. అయితే జగన్ మాత్రం వైనాట్ - 175 అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు.

అవును... ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్లుగా.. ఇప్పటికే టీడీపీ అధినేత జైల్లో ఉన్నారు.. పవన్ కల్యాణ్ షూటింగుల్లో ఉన్నారు.. చినబాబు ఢిల్లీలో ఉన్నారు.. బీజేపీ నేతలు ప్రో టీడీపీ - యాంటీ టీడీపీగా విడిపోయి ఉన్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో... జగన్ జనాల్లోకి రావాలని ఫిక్సయ్యారు. అందులో భాగంగా "ప్రజా ఆశీర్వాద యాత్ర" చేపట్టాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుని లోపల వేయడంతో టీడీపీకి చావుదెబ్బ తగిలిందనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో... జైలు ముందు పొత్తు ప్రకటించిన పవన్ కల్యాణ్.. కొంతమంది జనసైనికులను వంచించారని అంటున్నారు! ఈ సమయంలో జగన్ జనాల్లోకి రానున్నారు.

ఎన్నికలకు ముందు పాదయాత్రతో ప్రజల్లో ఉన్న జగన్... అధికారం వచ్చిన అనంతరం తనదైన పాలన అందించారు. సంక్షేమానికి అతిపెద్ద పీట వేశారు. ఇప్పుడు మరోసారి తన పాలనపై ప్రజల అభిప్రాయలు తెలుసుకోవడానికి, రాబోయే రోజుల్లో మరింత సుపరిపాలన అందిస్తానని హామీ ఇవ్వడానికి జగన్ జనాల్లోకి రాబోతున్నారు.

ఇదే సమయంలో ప్రతిపక్షాలను ప్రజల మధ్య నిలబెట్టి కడిగేసే పనికి పూనుకుంటున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి జగన్ వచ్చే నెల నుంచి ఇక ప్రజల మధ్యనే ఉండనున్నారు. ప్రజాశీర్వాద యాత్ర పేరుతో ప్రజల మద్దతు పెంచుకొనే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు.

ఇప్పటికే పలు సర్వేల ద్వారా నియోజకవర్గాల వారీగా అభ్యర్దుల లెక్కలతో సిద్దమయ్యారని తెలుస్తున్న నేపథ్యంలో.. జిల్లాల పర్యటన వేళ నేరుగా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు.. కార్యాకర్తలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఇదే సమయంలో వైసీపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో సభలలో పాల్గొనున్నారు.

ఇలా మరోసారి ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ జనాల్లోకి వస్తుండటంతో నాయకుల్లోనూ, కార్యకర్తల్లోనూ కొత్త ఉత్సాహం నెలకొందని అంటున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలంతా రోడ్లపై ఫ్లెక్సీలు పెడుతున్నారు "వైనాట్ 175" అని!

Tags:    

Similar News