రాజకీయం అంటే.. జగన్ విశ్లేషణను విని తీరాల్సిందే!

మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో చిన్నోడి నుంచి పెద్ద వయస్కుడి వరకు అందరి నోటా.. అనునిత్యం వచ్చే మాట.. రాజకీయం

Update: 2023-10-10 05:31 GMT

మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో చిన్నోడి నుంచి పెద్ద వయస్కుడి వరకు అందరి నోటా.. అనునిత్యం వచ్చే మాట.. రాజకీయం. ఇంతకూ రాజకీయం అంటే ఏమిటి? అంటే ఎవరికి వారు విశ్లేషిస్తుంటారు. తమ భావాన్ని వెల్లడిస్తుంటారు. రాజకీయం అన్న మాటకు ఎవరెన్ని మాటలు చెప్పినా.. దాన్ని మరింత లోతుగా విశ్లేషించాల్సినట్లుగా ఉంటుంది. తాజాగా ‘రాజకీయం’ అంటే ఏమిటంటే.. అంటూ ఏపీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్య.. ఆయన ఇచ్చిన నిర్వచనాన్ని చదవాల్సిందే.

రాజకీయం అంటే ప్రతి ఇంట్లో కూడా నిలవడమని.. మరణించిన తర్వాత ప్రతి ఇంట్లో కూడా మనం కనిపించటడమంటూ సూత్రీకరించారు. మనిషి చనిపోయాక కూడా ప్రతి ఇంట్లో కూడా ప్రతి గుండెలో కూడా ఉండటం తనకు తెలిసిన రాజకీయంగా విశ్లేషించిన సీఎం జగన్.. తన రాజకీయ ప్రత్యర్థుల రాజకీయం ఎలా ఉంటుందో చెబుతూ వారిపై మండిపడ్డారు. రాజకీయం అంటే అధికారంలోకి రావటం.. దోచుకోవటం.. దోచుకున్నది పంచుకోవటం కాదన్న ఆయన.. ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండటమే రాజకీయంగా పేర్కొన్నారు. మీ బిడ్డ ఎవరితోనూ పొత్తు పెట్టుకోడని.. రాజకీయ చరిత్రలో కానీ.. దేశ చరిత్రలో కానీ కొన్ని మాటలు చెప్పగలుగుతున్నాడని.. అబద్ధాల్ని నమ్మొద్దన్న జగన్.. మోసాలను నమ్మొద్దన్నాడు.

అడగటానికి సైతం ధైర్యం చేయని విషయాల్ని నేరుగా ప్రజలను ఉద్దేశించి మీ బిడ్డ జగన్ అడుగుతున్నాడన్న ఆయన.. అందుకే 'వై నాట్ 175?' పిలుపుతో అడుగులు వేస్తున్నట్లుగా పేర్కొన్నారు. రాజకీయం అంటే ఏమిటంటే.. అంటూ సీఎం జగన్ నోటి నుంచి వచ్చిన విశ్లేషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Tags:    

Similar News