ఫెయిల్ అయిన మోడల్ తోనే వైసీపీ ముందుకు ?
వైసీపీ ఏ రాజకీయ పార్టీలో లేని విధానాన్ని తీసుకుని వచ్చింది. ఆదిలో దానిని గొప్ప సంస్కరణగా ప్రచారం చేశారు.
వైసీపీ ఏ రాజకీయ పార్టీలో లేని విధానాన్ని తీసుకుని వచ్చింది. ఆదిలో దానిని గొప్ప సంస్కరణగా ప్రచారం చేశారు. ఎక్కడికి అక్కడ పార్టీ వ్యవస్థను ఏర్పాటు చేశామని కూడా చెప్పుకున్నారు. కానీ తీరా చూస్తే అది ఆచరణలో ఫెయిల్ కావడమే కాకుండా అధినాయకత్వానికి క్యాడర్ కి మధ్య పెద్ద అగాధాన్ని క్రియేట్ చేసింది. దాని ఫలితంగానే 2024 ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓటమి పాలు అయింది అని అంటున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ ఏపీ ని అయిదారు రీజియన్లుగా విభజించి ఒక్కో దానికీ రీజనల్ కో ఆర్డినేటర్లను నియమించింది.
అలా రీజనల్ కో ఆర్డినేటర్లకు మొత్తం ఆయా పారిధిలోని జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించింది. దీని వల్ల జిల్లా అధ్యక్షులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇతర ప్రజా ప్రతినిధులు కానీ తమ సమస్యలు అన్నీ రీజనల్ కో ఆర్డినేటర్లకే చెప్పుకోవాల్సి ఉంది.
పార్టీ అధినేత రీజనల్ కో ఆర్డినేటర్లతోనే సమావేశాలు నిర్వహిస్తూ వచ్చేవారు. అంటే కేవలం అయిదారుగురుతోనే పార్టీ మొత్తం విషయాలను ఆయన తెలుసుకోవాలని చూసేవారు. దీని వల్ల ఫీల్ గుడ్ ఒపీనియన్ అన్నదే పార్టీ హైకమాండ్ వద్దకు వెళ్ళేదని గ్రౌండ్ లెవెల్ లో ఏమి జరుగుతోంది అన్నది కనీసంగా కూడా తెలుసుకునే వీలు లేకపోయిందని విమర్శలు ఉన్నాయి.
అంతే కాదు రీజనల్ కోఆర్డినేటర్లు తమ పరిధిలో తామే పార్టీ వ్యవహారాలు చూస్తూ వచ్చేవారు. పార్టీలో వర్గ పోరు ఉన్నా చాలా మంది వాటిని పరిష్కరించలేక పోయారు. ప్రత్యేకించి కొంతమంది తామే వర్గాలను కూడా కొనసాగించిన దాఖలాలు ఉన్నాయని అంటున్నారు.
ఇక పార్టీ భారీ ఓటమి తరువాత వైసీపె అధినాయకత్వానికి ఈ విషయాలు అన్నీ తెలిసివచ్చాయని అనుకున్నారు. నేరుగా జిల్లా అధ్యక్షులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధినేతను కలిసే వీలు లేకపోవడం ఒక్క వైసీపీలోనే ఉందని ఇది పార్టీ నిర్మాణ వ్యవస్థలోనే అతి పెద్ద లోపంగానూ అంతా పేర్కొన్నారు.
దాంత్గో దీనిని తొలగించాలని ఇక మీదట ఈ విధానం ఉండదని చెప్పేలా అధినాయకత్వం మొదట్లో వ్యవహరించింది. కానీ ఏమి జరిగిందో ఏమో కానీ ఇపుడు మళ్ళీ అదే వ్యవస్థను తీసుకుని వచ్చింది. చాలా చోట్ల మళీ ఇదే పాత విధానం అమలు చేస్తున్నారు. ఈ తీరుగా అయితే వైసీపీ ఎత్తిగిల్లదని భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని పార్టీ వాదులు అంటున్నారు. వైసీపీకి గుదిబండగా మారుతున్న ఈ వ్యవస్థను తొలగించాలని వారు కోరుతున్నారు. మరి అధినాయకత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.