వైసీపీ కెలుకుడుకు రిజల్ట్ ఏంటి ?

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం మీద రాజకీయంగా పైచేయి సాధించే విషయంలో వైసీపీ వెనకబడుతోంది.

Update: 2025-01-14 19:30 GMT

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం మీద రాజకీయంగా పైచేయి సాధించే విషయంలో వైసీపీ వెనకబడుతోంది. నిజానికి విపక్షంలో ఉన్న పార్టీకి అది ఒక అడ్వాంటేజ్ గా ఉంటుంది. ఫలానాది చేయమని డిమాండ్ చేయవచ్చు, కొండమీద కోతిని కూడా తెచ్చి ఇవ్వమనవచ్చు. ఏది చేసినా అందులో తప్పులు పట్టుకుని పొలిటికల్ ర్యాగింగ్ చేయవచ్చు.

కానీ ఎందుకో వైసీపీ ఈ విషయంలో వీక్ గానే ఉంది. వైసీపీకి కూటమి ప్రభుత్వంలో అంతా మంచి కనిపిస్తోందా అంటే ఎలా కనిపిస్తుంది అని కూడా ప్రశ్నగా వస్తుంది. అయితే వైసీపీ నేతలు మాత్రం కొందరు ట్విట్టర్ కి పని చెబుతూంటారు. ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూంటారు.

అది ఫీల్డ్ లో మాత్రం కనిపించడం లేదు. దాంతో వైసీపీ పోరాటం అన్నది పెద్దగా లేకుండా పోతోంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట వ్యవహారంలో కూటమి ప్రభుత్వం బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చూసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక రోజంతా ఈ ఇష్యూ మీద అందరితో మాట్లాడి వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెచ్చారు.

అయితే విమర్శలు ఏమైనా ఈ ఇష్యూ మీద వచ్చాయీ అంటే అది జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారానే. ఆయన తొక్కిసలాట విషయంలో సీరియస్ అయ్యారన్నది జనంలోకి వెళ్ళింది. అంతేకాదు ఆయన టీటీడీ చేత క్షమాపణలు చెప్పించి లాజికల్ ఎండ్ కి విషయాన్ని తెచ్చారు.

అయితే అంతా అయ్యాకా ఇపుడు వైసీపీ కెలుకుతోంది. ఈ ఇష్యూలో బాధులను కఠినంగా శిక్షించమంటోంది. దీని మీద వైసీపీ అధినేత జగన్ ఇదే విషయం డిమాండ్ చేశారు. ఇపుడు టీటీడీకి నాలుగేళ్ల పాటు చైర్మన్ గా వైసీపీ ఏలుబడిలో పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి మీడియా ముందుకు వచ్చారు.

తిరుమల తొక్కిసలాటకు బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోకపోతే కోర్టులో కేసు వేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో బాధ్యుల మీద చర్యలు ఎందుకు లేవని ఆయన ప్రశ్నించారు. అదే లడ్డూ కల్తీ అయింది అంటూ చంద్రబాబు పవన్ హడావుడి చేశారు కదా ఇపుడు సైలెంట్ ఎందుకు అవుతున్నారని ఆయన నిలదీశారు.

దీంతో ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని వైసీపీ భావించడం లేదు అంటున్నారు. నిజానికి ఈ విషయం మీద విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మరి విచారణ కమిటీ ఇచ్చే నివేదిక బట్టి చర్యలు తీసుకుంటామని చెబుతోంది. ఇదే విషయం రేపు వైసీపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినా ప్రభుత్వం ఇదే విధంగా తన వాదన వినిపించే అవకాశం ఉంది అంటున్నారు. మరి కోర్టుకు వెళ్లాలని వైసీపీ అనుకుంటోంది. ఏమి సాధించాలని అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

అయితే తిరుపతి లడ్డూ కల్తీ అయింది అన్న ఇష్యూలో వైసీపీ బదనాం అయింది. ఇపుడు ఏకంగా ఆరుగురు అమాయక భక్తులు తొక్కిసలాటలో మరణించారు. అయినా సరే ఈ ఇష్యూ సాఫీగానే ఎండ్ కార్డుతో సైలెంట్ అయింది. దాంతో వైసీపీ దీనిని రైజ్ చేయాలని చూస్తోందా అన్న చర్చ సాగుతోంది. అయితే వైసీపీ నిజంగా ఈ విషయం మీద ఏదైనా చేయాలి అనుకుంటే మొదట్లోనే చేసి ఉంటే వేరేగా ఉండేదని అంటున్నారు. ఇపుడు ఈ ఇష్యూలో వైసీపీ న్యాయ పోరాటం చేసినా రిజల్ట్ ఎలా ఉంటుందో అన్న చర్చ సాగుతోంది.

Tags:    

Similar News