అందరూ వదిలేశారు...వైసీపీ మాజీ ఎంపీ భార్య హాట్ కామెంట్స్ !

వైసీపీ ఓటమి పాలు అయిన తరువాత గతంలో అధికారంలో ఉంటూ హడావుడి చేసిన వారు అంతా ఇపుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నారు

Update: 2025-01-14 20:30 GMT

వైసీపీ ఓటమి పాలు అయిన తరువాత గతంలో అధికారంలో ఉంటూ హడావుడి చేసిన వారు అంతా ఇపుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నారు. ఇక బాపట్ల ఎంపీగా అయిదేళ్ల పాటు తనదైన శైలిలో రాజకీయ దూకుడు చేసిన నందిగం సురేష్ పరిస్థితి అయితే అందరిలోనూ దారుణం అని అంటున్నారు.

ఆయన నెలల తరబడి జైలులో మగ్గుతున్నారు. బెయిల్ కూడా రావడం లేదు. ఇక ఆయన మీద పెట్టిన కేసులతో తీవ్రంగా ఇరుకున పడ్డారు. ఆయన వైసీపీ అధికారంలో ఉన్నపుడు ఫైర్ బ్రాండ్ ఎంపీగా ఉండేవారు. అయితే ఇపుడు ఆయన జైలు గోడలకు పరిమితం అయిపోయారు.

ఆయన మీద వివిధ కేసులలో బలమైన సెక్షన్లు పెట్టారు. దాంతో ఆయన రాజకీయంగా అత్యంత ప్రతికూల పరిస్థితిని ఫేస్ చేస్తున్నారు. అయితే ఆయన విషయంలో వైసీపీ హైకమాండ్ పట్టించుకోవడం లేదా అన్న చర్చ సాగుతోంది. ఆయనకు న్యాయపరంగా సాయం ఎంతవరకూ అందుతోంది నైతికంగా మద్దతు ఏ మేరకు దక్కుతోంది అన్నది కూడా ఇపుడు ఆలోచిస్తున్నారు.

ఇక ఈ మాజీ ఎంపీ సతీమణి బేబీ లత అయితే ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త నందిగం సురేష్ ఎంపీగా ఉన్నపుడు ఎంతో మందికి సహాయం చేశారని నాడు ఆయన నుంచి లబ్ది పొందిన వారు ఎవరూ ఇపుడు కనిపించడం లేదని అన్నారు.

తన భర్త అరెస్ట్ జైలు తరువాత తమ కుటుంబానికి ఏ మాత్రం భద్రత లేకుండా పోయిందని అన్నారు. అమరావతి రాజధానిలో తన కుటుంబాన్ని ఉండనీయకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని ఆమె సంచలన విమర్శన చేశారు.

ఇదిలా ఉంటే నందిగం సురేష్ నెలల తరబడి జైలులో ఉన్నారు. ఆయన విషయంలో వైసీపీ అధినాయకత్వం పూర్తి సహాయం అందిస్తొందా అన్న సందేహాలు ఆయన భార్య బేబీ లత మాటలను చూస్తే వస్తున్నాయి. తమ వద్ద అన్ని రకాలుగా లబ్ది పొందిన వారు తమను వాడుకుని వదిలేశారు అన్న ఆవేదనను ఆమె వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు తమ మీద కుట్ర జరిగిందని అంటున్నారు. తమకు రకషణ లేదని వాపోతున్నారు.

మరి వైసీపీ ఈ విషయంలో కలుగచేసుకుని నందిగం సురేష్ ని జైలు నుంచి బయటకు రప్పించే విషయంలో మరింత పోరాటం చేస్తుందా అన్నది కూడా చూడాలని అంటున్నారు. ఇక సురేష్ ఎంపీగా ఉన్నప్పుడు లబ్ది పొందిన వారు ఎవరూ ఇపుడు కనిపించడం లేదు అన్న ఆమె మాటలు వైసీపీ నేతలను ఉద్దేశించేనా అన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా నెలల తరబడి ఒక మాజీ ఎంపీ జైలులో ఉండిపోయారు. ఆయన విషయంలో కనుక వైసీపీ ఇంతకు మరింతగా రాజకీయ, న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆమె వైపు నుంచి వినిపిస్తున్న మాట అని అంతా అంటున్నారు.

Tags:    

Similar News