ఆహ్వానించినా అవమానించారంటూ షర్మిలపై ఫైర్!
అవును... వైఎస్ జగన్ మేనల్లుడు రాజారెడ్డి నిశ్చితార్ధం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.
వైఎస్ షర్మిల తనయుడు, వైఎస్ జగన్ మేనల్లుడు రాజారెడ్డి, ఆయనకు కాబోయే భార్య ప్రియా అట్లూరి నిశ్చితార్థం గురువారం హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇదే సమయంలో పవన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని దృశ్యాలను సోషల్ మీడియా జనాలు డీకోడ్ చేసే పనిలో ఉంటే.. మరికొంతమంది పరిశీలకులు తమదైన విశ్లేషణ ఇస్తున్నారు.
అవును... వైఎస్ జగన్ మేనల్లుడు రాజారెడ్డి నిశ్చితార్ధం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఈ నిశ్చితార్ధానికి సంబంధించి వీడియోలు, ఫోటోలు చూసిన కొంతమంది నెటిజన్లు... షర్మిలపై కామెంట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా... షర్మిల ఫోటోలు దిగిన విధానం చూస్తుంటే... తన సోదరుడు జగన్ కంటే పవన్ కే అధిక ప్రాధాన్యత ఇచ్చారని వ్యాఖ్యానిస్తున్నారు.
జగన్ వేదికపైకి వచ్చిన వెంటనే షర్మిలను ఆలింగనం చేసుకుని భారతితో కలిసి కాబోయే దంపతులను ఆశీర్వదించారు. విజయమ్మను కౌగిలించుకుని షర్మిలకు వీడ్కోలు పలికిన అనంతరం ఆయన త్వరితగతిన వెళ్లిపోయారు. కాబోయే దంపతులకు పుష్పగుచ్ఛం ఇస్తున్న సమయంలో షర్మిలను వేదిక మధ్యలోకి రప్పించేందుకు జగన్ ప్రయత్నించారని, అయితే షర్మిల మాత్రం జగన్ ను పట్టించుకోలేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదే సమయంలో... ఈ కార్యక్రమానికి జగన్ తన సతీమణి వైఎస్ భారతితో కలిసి హాజరయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వేడుక ప్రాంగణంలోకి అడుగుపెట్టిన జగన్.. షర్మిలను సోదర ఆప్యాయతలతో పలకరించారు. నూతన వధూవరులు పుష్పగుచ్ఛాలు అందించి ఆశీస్సులు అందించారు. ఈ క్రమంలో జగన్ తన జ్ఞాపకార్థం గ్రూప్ ఫోటో కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా షర్మిళను, బావ అనీల్ ను ఆహ్వానించారు.
అయితే వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం... గ్రూప్ ఫోటోలో పాల్గొనాలన్న జగన్ ఆహ్వానాన్ని షర్మిల దంపతులు తిరస్కరించినట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో కూతురి తడబాటును గమనించిన వైఎస్ విజయమ్మ జోక్యం చేసుకోవడంతో షర్మిల, అనిల్ లు జగన్ తో ఫోటో దిగేందుకు దగ్గరగా వచ్చారు. దీంతో ఒక వర్గం మీడియా క్రికేటివిటీకి పనిచెప్పింది.. ఇందులో భాగంగా... షర్మిల తన సోదరుడిని దూరం పెట్టిందని విస్తృతంగా ప్రచారం చేసింది.
దీంతో... షర్మిల తీరుపై విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. ఇందులో భాగంగా... జగన్ ను, ఆయన కుటుంబాన్ని ఆమె అగౌరవపరిచారని ఆరోపిస్తున్నారు. జగన్ ను గౌరవంగా చూసేందుకు ఇష్టపడకపోతే ఎందుకు ఆహ్వానించారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో... షర్మిల అహంకారపూరితంగా ప్రవర్తించినా.. జగన్ మాత్రం ఆమె పట్ల ఆప్యాయంగా, మర్యాదగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.
ఈ సమయంలో... జగన్ ని చూసిన ఆయన అభిమానులు, సమాజంలోని పరిశీలకులు మాత్రం... జగన్ కి సింప్లిసిటీ ఎక్కువని, ఆయనకు సెంటిమెంట్స్ ఎక్కువని, షర్మిళ ప్రవర్తించిన తీరు ఆమోదయోగ్యం కాదని అంటున్నారు.