పాశవిక నేర ఫలితం... ఈ మానవ మృగానికి మూడు మరణశిక్షలు!
అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై ఓ 30 ఏళ్ల మానవ మృగం హత్యాచారం జరిపింది. ఈ కేసులో ప్రత్యేక కోర్టు ముమ్మారు మరణశిక్ష విధించింది.;
మానవత్వం అనేది ఏమాత్రం లేనట్లుగా ప్రవర్తించిన ఓ ఫ్యామిలీకి కోర్టు కఠిన శిక్షలు విధించింది. ఇందులో భాగంగా... నిందితుడికి మరణ శిక్ష విధించగా.. అతడి తల్లికి, సోదరికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఐదేళ్ల బాలికను అపహరించి అత్యాచారం జరిపి హతమార్చిన కేసులో నిందితుడు అతుల్ నిహలే ను దోషిగా నిర్ధారించింది.
అవును... అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై ఓ 30 ఏళ్ల మానవ మృగం హత్యాచారం జరిపింది. ఈ కేసులో ప్రత్యేక కోర్టు ముమ్మారు మరణశిక్ష విధించింది. ఈ సందర్భంగా స్పందించిన న్యాయమూర్తి... నిందితుడు అత్యంత క్రూరంగా, పాశవికంగా నేరానికి పాల్పడ్డాడని.. అతడికి మూడు మరణశిక్షలు విధించడమే సబబని కోర్టు పేర్కొన్నారు.
ఇదే సమయంలో... ఇది అత్యంత అరుదైన కోవకు చెందిన కేసని కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో... దీనికి సంబంధించిన నిందితుడు అతుల్ నిహలే తల్లికి, సోదరికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఐదేళ్ల బాలికను అపహరించి అత్యాచారం చేసి, హతమార్చిన ఈ కేసులో అతడిని దోషిగా న్యాయస్థానం నిర్ధారించింది.
వివరళ్లోకి వెళ్తే... గత ఏడాది సెప్టెంబర్ లో భోపాల్ లోని షాజహానాబాద్ ప్రాంతంలో.. తన చిన్నాన్న ఇంటికి వెళ్లిన చిన్నారి తిరిగి రాలేదు. దీంతో.. ఆమె నాన్నమ్మ ఆందోళన చెంది, బాలిక కోసం తీవ్రంగా వెదికారు. ఇలా ఎంత వెదికినా కనిపించకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో జాగిలాలతో పోలీసులు రంగంలోకి దిగారు.
గాలింపు చర్యల్లో భాగంగా.. పోలీసుల జాగిలాలు నిందితుని ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గమనించాయి. దీంతో.. పోలీసులు వారిని నిలదీయగా.. అది ఎలుకలు చచ్చిన వాసన అని నిందితుని తల్లి, సోదరి బదులిచ్చారు. ఈ సమయంలో పోలీసులు వారి ఇంటిలోని ఒక తెల్ల ట్యాంక్ నుంచి దుర్వాసన వస్తోందని గుర్తించి అక్కడకు చేరుకున్నారు.
ఈ సమయంలో ట్యాంక్ లోకి తొంగి చూడగా.. లోపల బాలిక కాళ్లు కనిపించాయి. అనంతరం ట్యాంక్ మూతను తొలగించి బాలిక మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సమయంలో తానే ఈ ఘోరానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. ఈ పాడుపనికి తన తల్లి, సోదరి సహకరించారని కూడా తెలిపాడని అంటున్నారు.
దీంతో... అతుల్ నిహలే తల్లికి, సోదరికి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. నిందితుడు అతుల్ కి మాత్రం మూడు మరణశిక్షలు విధించడమే సబబని పేర్కొంది.