'పురుషులకూ రుతుక్రమం ఉండాల్సింది'... సుప్రీం షాకింగ్ కామెంట్స్!

మధ్యప్రదేశ్ లో ఆరుగురు మహిళా జడ్జిలను పనితీరు ఆశించిన స్థాయిలో లేదంటూ తొలగించిన సంగతి తెలిసిందే.

Update: 2024-12-05 04:01 GMT

మధ్యప్రదేశ్ లో ఆరుగురు మహిళా జడ్జిలను పనితీరు ఆశించిన స్థాయిలో లేదంటూ తొలగించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు నవంబర్ 11 - 2023లో సుమోటోగా విచారణకు స్వీకరించింది. హైకోర్టుతో పాటు తొలగింపుకు గురైన మహిళా జడ్జిలకు నోటీసులిచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

అవును... మధ్యప్రదేశ్ హైకోర్టు ఆరుగురు మహిళా జడ్జ్ లను తొలగించిన వేళ.. ఈ వ్యవహారాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకోగా.. ఆ ఆరుగురిలో నలుగురు మహిళా జడ్జిలను తిరిగి నియమిస్తూ ఎంపీ హైకోర్టు విస్తృత ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 1న నిర్ణయం తీసుకుంది. అయితే... మరో ఇద్దరు మహిళా జడ్జిలకు మాత్రం రీపోస్టింగ్ ఉత్తర్వ్యులు ఇవ్వలేదు.

వీరిలో అదితి కుమార్ శర్మ పనితీరు అత్యంత పేలవంగా ఉందని సుప్రీంకోర్టుకి హైకోర్టు నివేదించింది. ఇందులో భాగంగా... 2022లో ఆమె వద్ద 1,500 కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపింది. దీనిపై స్పందించిన అదితి కుమార్ శర్మ... 2021లో తనకు గర్భస్రావం అయ్యిందని, తన సోదరుడికి క్యాన్సర్ సోకిందని తెలిపారు.

దీనికి తోడు కరోనా వ్యాప్తి సమయంలో కోర్టులు పనిచేయలేదని గుర్తుచేస్తూ.. తన పనితీరును మదింపు చేసే సమయంలో వెటర్నరీ లీవులో ఉన్న విషయాన్ని హైకోర్టు విస్మరించిందని తెలిపారు. ఇక్కడ తన ప్రాథమిక హక్కులకు భగం కలిగిందని ఆరోపించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది!

ఇందులో భాగంగా... పురుషులకు కూడా రుతుక్రమం ఉండాల్సింది.. సంతానాన్ని కనడంలో మహిళలూ పడే ఇబ్బందులు ఏమిటో తెలిసేది అంటూ జస్టిస్ బి.వి. నాగరత్నం, జస్టిస్ ఎన్. కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో... సివిల్ జడ్జిల తొలగింపుకు అనుసరిస్తోన్న విధానంపై వివరణ ఇవ్వాలంటూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆదేశించింది.

ఆ మహిళా జడ్జికి గర్భస్రావం జరిగినప్పుడు ఆమె మానసికంగా, శారీరకంగా ఎంతో వేదనకు గురయ్యే అవకాశం ఉంటుందని జస్టిస్ బీవీ నాగరత్నం పేర్కొన్నారు. ఇటువంటి ఆరోగ్య ప్రమాణాలు పురుష న్యాయమూర్తులకు ఉండాలని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు నిర్ణయాన్ని తీవ్రంగా ఆక్షేపించారు.

Tags:    

Similar News