ధ‌నుష్‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పు.. న‌య‌న్ ఎలా రియాక్ట్ అవుతుందో

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార లైఫ్ ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ న‌య‌న‌తారః బియాండ్ ది ఫెయిరీ టేల్ పేరిట‌ డాక్యుమెంట‌రీగా తీసిన విష‌యం తెలిసిందే.

Update: 2025-01-28 09:53 GMT

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార లైఫ్ ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ న‌య‌న‌తారః బియాండ్ ది ఫెయిరీ టేల్ పేరిట‌ డాక్యుమెంట‌రీగా తీసిన విష‌యం తెలిసిందే. ఈ డాక్యుమెంట‌రీలో నిర్మాత ధ‌నుష్ ప‌ర్మిష‌న్ తీసుకోకుండా నానుమ్ రౌడీ దాన్ సినిమాలోని విజువ‌ల్స్ ను వాడుకున్నారు. దీంతో ధ‌నుష్ కోర్టులో కాపీరైట్ పిటిష‌న్ దాఖ‌లు చేశాడు.

నెట్‌ఫ్లిక్స్ దానికి బ‌దులుగా ధ‌నుష్ పిటిష‌న్ ను కొట్టేయాల‌ని మ‌ద్రాసు హైకోర్టులో ద‌ర‌ఖాస్తు చేయ‌గా, ఆ పిటిష‌న్ ను హైకోర్టు కొట్టివేసింది. గ‌తేడాది న‌వంబ‌ర్ లో న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్, వారికి చెందిన రౌడీ పిక్చ‌ర్స్ పై ధ‌నుష్ కేసు ఫైల్ చేశాడు. ధ‌నుష్ త‌మ‌పై కేసు న‌మోదు చేయ‌డంతో న‌య‌న‌తార ధ‌నుష్ ను విమ‌ర్శిస్తూ బ‌హిరంగ లేఖ రిలీజ్ చేయ‌డంతో ఈ వివాదం బాగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అయితే ఇప్పుడు ఈ విష‌యంలో మ‌ద్రాసు కోర్టు ధ‌నుష్ కు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. ధ‌నుష్ అనుమ‌తి లేకుండా అత‌ని సినిమా క్లిప్స్ వాడుకోవ‌డాన్ని న్యాయ‌స్థానం త‌ప్పుప‌ట్టింది. అంతేకాదు బ‌యోపిక్ పై మ‌ధ్యంత‌ర నిషేధం విధించాల‌న్న ధ‌నుష్ నిర్మాణ సంస్థ పిటిష‌న్ పై ఫిబ్ర‌వరి 5న విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్టు కోర్టు వెల్ల‌డించింది. మ‌రి నయ‌న‌తార దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇక సినిమాల విష‌యానికొస్తే ధ‌నుష్ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం తెలుగులో శేఖ‌ర్ క‌మ్ముల‌తో కుబేర సినిమా చేస్తున్న ధ‌నుష్ ఆ సినిమాను త్వ‌ర‌లోనే ముగించ‌నున్నాడు. కుబేరతో పాటూ ఇడ్లీ క‌డాయి అనే సినిమాను స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు. ఇది కాకుండా అమ‌ర‌న్ డైరెక్ట‌ర్ రాజ్‌కుమార్ పెరియ‌స్వామితో ఓ య‌దార్థ క‌థ‌ను సినిమాగా చేయ‌డానికి ఓకే చేశాడు.

మ‌రోవైపు న‌య‌న‌తార కూడా చేతినిండా ఆఫ‌ర్ల‌తో బిజీగా ఉంది. మూడు తమిళ సినిమాలు, రెండు మ‌ల‌యాళ సినిమాలతో పాటూ రీసెంట్ గా కెజిఎఫ్ స్టార్ య‌ష్ తో క‌లిసి టాక్సిక్ అనే సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. టాక్సిక్ సినిమాలో న‌య‌న‌తార పాత్ర క‌థ‌లో చాలా ప్ర‌ధానంగా ఉండ‌బోతుంద‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News