ఆ వీడియోలు చూస్తూ రోజుకు 3సార్లు చేయాలంటూ భార్య టార్చర్!
ఈ తరం వారికి గుర్తుండకపోవచ్చు. డెభ్బైల్లోనూ.. ఎనభై మొదట్లో పుట్టినోళ్లకు అప్పట్లో వచ్చిన ఒక సంచలన మూవీ గుర్తుండే ఉంటుంది.
ఈ తరం వారికి గుర్తుండకపోవచ్చు. డెభ్బైల్లోనూ.. ఎనభై మొదట్లో పుట్టినోళ్లకు అప్పట్లో వచ్చిన ఒక సంచలన మూవీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఫేమస్ దర్శకుడిగా గుర్తింపు పొందిన దివంగత ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘జంబలకడిపంబ’. ఈ చిన్న మూవీ పెద్ద హిట్ కొట్టింది. అంతకంతే.. టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. అందరూ ఈ సినిమా గురించి విచిత్రంగా మాట్లాడుకునే వారు. మగాళ్ల మాదిరే ఆడోళ్లు అధిపత్యం వచ్చేసి.. అంతా ఆడరాజ్యం వచ్చేసి.. మగాళ్లను అప్పట్లో ఆడోళ్లను ఏ రకంగా అయితే ఇబ్బందులకు గురి చేశారో.. అలానే చేస్తే ఏమవుతుందో తెలుసా? అన్న విషయాన్నికామెడీగా చెప్పిన వైనం ఆసక్తికరం.
ఇదంతా ఎందుకంటే.. ఇప్పుడు అలాంటి ఉదంతమే వెలుగు చూసింది. పాడు వీడియోలు చూడటం.. అలానే చేయాలంటూ టార్చర్ పెట్టే భర్తలతో విసిగిపోయే భార్యల ఉదంతాలు చూశాం. ఇప్పుడు అందుకు రివర్సు చోటు చేసుకుంది. హర్యానాకు చెందిన ఒక మహిళ నిత్యం పాడు వీడియోల్ని చూడటం.. అందులో మాదిరి రోజుకు మూడుసార్లు తన కోరిక తీర్చాలంటూ భర్తను పెట్టే టార్చర్ తో భర్త విసిగిపోవటమే కాదు.. కోర్టుకు ఆశ్రయించాడు.
హర్యానాలోని మహేందర్ గఢ్ ప్రాంతానికి చెందిన ఒక జంటకు2017లో పెళ్లైంది. వీరున్న ఇంట్లో కింది పోర్షన్ లో అత్తామామలు ఉంటే.. వీరిద్దరూ మొదటి అంతస్తులో ఉంటారు. పాడు వీడియోల్ని చూడటం అలవాటుగా మారటమే కాదు.. ఆ వీడియోలకు బానిసగా మారిపోయింది. అందులో మాదిరే భర్త తనతో పావుగంట పాటు సంభోగం చేయాలని.. రోజూ రాత్రిళ్లు మూడుసార్లు చేయాల్సిందేనని పట్టుపట్టేది.
అక్కడితో ఆగని ఆమె.. అతడిలో పటుత్వం లేదని.. తనకో మరో అబ్బాయితో పెళ్లి చేసుకోవాలని ఉందంటూ భర్తను ఇబ్బంది పెట్టేది. భర్త ఎప్పుడైనా అనారోగ్యానికి గురైతే.. అతడ్ని నపుంశకుడని వెక్కిరిస్తూ.. తనకు కావాల్సినంత శారీరక సుఖం ఇవ్వలేదంటూ వేధించేది. దీంతో అతడు విసిగిపోయాడు. అదే సమయంలో అతడితో విడిపోయేందుకు వీలుగా ఒక పంచాయితీ కూడా పెట్టారు. ఈ క్రమంలో భర్త కుటుంబం మొత్తాన్నిఇరికిస్తానని.. తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి ఆస్తి కోసం డిమాండ్ చేసింది.
దీంతో విసిగిపోయిన భర్త కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో భార్య రివర్సులో తనను అత్తమామలు వేధింపులకు గురి చేసినట్లుగా ఆరోపించింది. ఈ కేసు విచారణ సందర్బంగా అత్తమామలు కూడా వాంగ్మూలం ఇచ్చారు. తన కొడుకును కోడలు హిజ్రా అని పిలిచేదని.. ఆరేళ్లుగా భార్యభర్తలు దూరంగా ఉంటున్నారని.. వారికి విడాకులు ఇవ్వాల్సిందిగా వేడుకున్నారు. విచారణలో భాగంగా కోర్టు ముందు వచ్చిన ఆధారాల్ని పరిశీలించిన కోర్టు.. భర్తను భార్య హిజ్రాఅని పిలవటం క్రూరత్వంగా పేర్కొంటూ.. భార్య ప్రవర్తనను పరిగణలోకి తీసుకున్న కోర్టు విడాకులకు సానుకూలంగా స్పందించింది. అంతేకాదు.. అంతకు మందు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకులను సమర్థించింది. భార్య డిమాండ్లను పక్కన పెట్టి.. భర్త వాదనలకు సానుకూలంగా స్పందించిన పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఉదంతం గురించి తెలిసినోళ్లు.. ఇలాంటి ఆడోళ్లు ఉంటారా? అంటూ ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి.