'సూసైడ్ చేసుకుంటానని భర్తను బెదిరించడం'పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

ఈ సమయంలో భార్య ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.;

Update: 2025-03-26 17:30 GMT
Supreme court new rules on suicides

ఇటీవల కాలంలో భార్యల వేధింపులు తాళలేక చాలామంది భర్తలు సూసైడ్ నోట్ లు రాసి, వీడియోలు విడుదల చేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి. వారు తమ తమ ఆత్మహత్యలకు చెప్పిన కారణం.. భార్య, అత్తమామల వేధింపులు భరించలేక అని! ఈ సమయంలో భార్య ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

అవును... వివరాళ్లోకి వెళ్తే... ఓ జంటకు 2009లో వివాహం జరిగింది. ఈ సమయంలో తన భార్య ఆత్మహత్య చేసుకుంటానంటూ తనను, తన తల్లితండ్రులను వేధిస్తుందని భార్య కేసు పెట్టారు! వివాహం తర్వాత తమ వైవాహిక జీవితంలో భార్య పేరెంట్స్ జోక్యం ఎక్కువైపోయిందని.. తరచూ తాము కాపురం ఉంటున్న ఇంటికి వచ్చేవారని ఫిర్యాదులో పేర్కొన్నారు!

ఇదే సమయంలో.. 2010లో ఒక రోజు తన భార్య ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తమ ఇంటిని వదిలి, పుట్టింటికి వెళ్లిపోయిందని.. విషయం తెలుసుకుని అక్కడకు వెళ్తే.. తనను అవమానించారని భర్త పేర్కొన్నాడు. ఈ క్రమంలో తమకు కుమార్తె జన్మించిందని.. విషయం తెలిసి తనతో పాటు, తన తల్లితండ్రులను తీసుకుని అత్తింటికి వెళ్తే.. అందరినీ అవమానించారని పేర్కొన్నారు.

అదే విధంగా... ఆత్మహత్య చేసుకుంటానని నిత్యం తనను, తన కుటుంబ సభ్యులను ఆమె వేధిస్తుందని.. జైలుకు పంపుతానని ఆమె బెదిరిస్తుందని ఆరోపించారు. ఈ సమయంలో భార్య తరుపు న్యాయవాది వాదనలు ఈ విధంగా జరిగాయి.

ఇందులో భాగంగా... ఆరోపించిన క్రూరత్వం విడాకుల డిక్రీని మంజూరు చేయడానికి సరిపోదని వాదించారు. క్రూరత్వానికి సంబంధించిన ఏ ఆరోపణపైనా విడాకుల డిక్రీని మంజూరు చేయలేమని అన్నారు. అయితే... ఆమె ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన ఆధారాలను దాచడానికి.. చేతికి మెహందీ రాసుకొందని భర్త తరుపు న్యాయవాది వాదించారు.

ఈ నేపథ్యంలోనే స్పందించిన ముంబై హైకోర్టు న్యాయమూర్తి ఆర్.ఎం. జోషితో కూడిన సింగిల్ బెంచ్ తీర్పు చెప్పింది. ఇందులో భాగంగా.. జీవిత భాగస్వామి ఆత్మహత్య బెదిరింపు చర్యలు, ఆత్మహత్యకు ప్రయత్నించడం వంటివి ఎంతటి క్రూరత్వానికి దారితీస్తుందంటే.. అది విడాకులకు కారణమవుతుంది అని అన్నారు.

ఈ సందర్భంగా... ఆత్మహత్య చేసుకుంటానని భర్తను, అతని కుటుంబ సభ్యులను బెదిరించడం క్రూరత్వం కిందకే వస్తుందని కోర్టు స్పష్టం చేసింది. భార్య ఆత్మహత్య పేరిట తన కుటుంబాన్ని వేధిస్తుందంటూ ఓ భర్త దిగువ కోర్టులో విడాకులకు అప్లై చేయగా.. కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ సమయంలో భార్య.. హైకోర్టును ఆశ్రయించగా.. ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసి, కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది!

Tags:    

Similar News