ఇప్పుడే తీసుకో... తర్వాత చెల్లించుకో!

Update: 2015-07-24 03:55 GMT
సామాన్యుడికి, మధ్యతరగతి వారికి "వాయిదాల పద్దతి" బాగా నచ్చుతుంది... కారణం సౌకర్యంగా ఉంటుంది కాబట్టి! ఒకేసారి మొత్తం డబ్బు చెల్లించడం సామాన్యుడికి సాధ్యం కాదనే చెప్పాలి! ఈ క్రమంలో విమాన టిక్కెట్లు కూడా వాయిదా పద్దతిలో అందుబాటులోకి తీసుకువస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించింది ఒక ఎయిర్ లైన్స్ సంస్థ! అనుకున్నదే తడవుగా ప్రకటన విడుదల చేసేసింది! అయితే సామాన్యులకు సైతం విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తామంటూ ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఒక ఎయిర్‌లైన్స్ సంస్థ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం సామాన్యులకు సంతోషం కలిగిస్తుంది! అంటే... ఇంతకాలం టీవీలు, ఫ్రిజ్ లు, వాషింగ్ మెషిన్ లు వంటివి మాత్రమే వాయిదాల పద్దతిలో కొనుక్కున్న సామాన్యుడు... ఇప్పుడు విమాన టిక్కెట్లను కూడా పొందొచ్చన్న మాట!

అయితే ఈ ఆఫర్ ని దేశంలోనే తొలిసారిగా స్పైచ్ జెట్ ప్రవేశ పెట్టింది! టిక్కెట్లు కావాలనుకునే ప్రయాణికులు ఆ ఛార్జీలను విడతల వారీగా ఏడాదిలోపు చెల్లించవచ్చు. ఈ పథకం పేరు "బుక్ నౌ... పే లేటర్"! కాకపోతే ఇలా వాయిదాల్లో టిక్కెట్లు కొనేవారికి 12 - 14% వడ్డీ అదనంగా పడుతుంది! ఒకవేళ టిక్కెట్ క్యాన్సిల్ చేసుకుంటే అప్పటికే బిల్ల్లింగ్ అయిన వడ్డీ ఖర్చులను వినియోగదారులే భరించాల్సి ఉంటుంది! దీనికోసం కొన్ని బ్యాంకుల (Axis Bank, Kotak Bank, HSBC Bank, Standard Chartered Bank) క్రెడిట్ కార్డులు ఉన్న వారికి మాత్రమే అవకాశం ఉంది! త్వరలోనే మిగిలిన బ్యాంకు ఖాతాధారులకు కూడా ఈ అవకాశం వర్తించనుంది!
Tags:    

Similar News