అందమైన అమ్మాయిలను భయపెట్టే కాలం వేసవి. బయటకు వెళ్లకుండా చర్మసౌందర్యాన్ని కాపాడుకుంటారు కొందరు.. కానీ అందరికీ అది సాధ్యం కాదు కదా.. అందుకే ఎండాకాలం చర్మ సౌందర్యం కాపాడుకోవడం చాలా అవసరం. బాగా ఎండల్లో తిరిగితే చర్మం కమిలిపోతుంది.. అదేకానీ జరిగితే ఆ చర్మం మళ్లీ మామూలుగా మారడం చాలా కష్టం. కమిలిపోయిన చర్మాన్ని యధాస్థితికి తేవాలంటే ఎన్నో చిట్కాలు ఉన్నాయి. మీరూ ట్రై చేయండి మరి..
- బక్కెట్ నిండా నీళ్లు తీసుకుని దాన్లో రెండు నిమ్మకాయలు పిండాలి. ఆ రసం నీళ్ళలో బాగా కలిసాక ఆ నీళ్ళతో స్నానం చేయాలి. దీనిని కొన్ని నెలలవరకూ కొనసాగించాలి.
- ప్రతి రోజూ చర్మానికి తేనెను పూతగా రాయాలి. తలవెంట్రుకలకు మాత్రం తగలకుండా జాగ్రత్త పడాలి..ఎక్కువసేపు ఉండకుండా కాస్త ఆరగానే స్నానం చేయాలి.
- బాదం పాలు ముఖానికి పట్టించి రాత్రంతా ఉంచుకోవాలి. ఉదయం లేవగానే గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ఫ్రెష్‌గా తయారవుతుంది.
నానబెట్టిన బాదం పప్పుల్ని పచ్చిపాలలో కలిపి పేస్టులా చేయాలి. ఈ పేస్టును ముఖం మీద కనీసం ప్రతిరోజూ ఒక గంటసేపు ఉంచు కోవాలి. రాత్రిపూట దీన్ని రాసుకుని పడుకుంటే మంచిది. ఉదయానికి ముఖం కాంతిని సంతరించు కుంటుంది.
- నిమ్మ, తులసి ఆకుల రసం సమపాళ్ళలో లిపి రోజూ రెండుసార్లు ముఖానికి పట్టించాలి. ఆరిన తరువాత చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి.
- బంగాళాదుంపల రసం తీసి ముఖానికి రాసుకున్నా మంచి ఫలితం వుంటంది. రాసిన తరువాత అర గంట వరకూ అలాగే ఉంచాలి. వారానికి రెండు, మూడు సార్లు ఇలా చేయడం వల్ల కమిలిపోయిన చర్మం మంరి రంగులోకి మారుతుంది.
- పచ్చిపాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టాలి. తర్వాత ఆ పాలు ఫ్రిజ్‌లో ఉంచాలి. రోజూ ఒక దూది పింజను తీసుకుని కమిలిపోయిన చర్మంపై రుద్దుతూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
- శనగపిండి, నెయ్యి, పసుపు పేస్టులా తయారుచేసి చర్మంపై రాయాలి. కొద్దిగా ఆరాక చేత్తో మృదువుగా గుండ్రంగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే పొడిబారిన చర్మం పై ఉన్న మురికి తొలగిపోతుంది. దీనితో పాటు తగ్గిపోయిన ఛాయ మెరుగుపడుతుంది.
మీగడలో పసుపు కలిపి రోజూ చర్మానికి దాన్ని రాసుకుంటే మంచి ఫలితం వుంటుంది. ఇలా రాసుకున్న తరువాత మెత్తగా, నెమ్మదిగా మసాజ్ చేయాలి.
గంధం పొడిని, పసుపు, రోజ్‌వాటర్ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే ఛాయ మెరుగుపడుతుంది. ఎండకు నల్లగా మారిన చర్మం కాంతివంతంగా మారుతుంది