# గర్ల్ ఫ్రెండ్ ఎఫెక్ట్... మార్పు ఉంటే చెప్పు!
కొన్ని రోజుల క్రిందట "బాయ్ ఫ్రెండ్ ఎయిర్","బాయ్ ఫ్రెండ్ ఎఫెక్ట్" పేరిట కొద్ది రోజులు ఓ ట్రెండ్ చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక కొత్త విషయం ట్రెండ్ అవుతుంది. అదేముంది.. సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక విషయం ట్రెండ్ అవుతూనే ఉంటుంది కదా... పైగా ఏ విషయం ఎందుకు ట్రెండ్ అవుతుందో ఎవరికీ తెలియదు అని అంటారా? కరెక్ట్ అనుకోండి...! కానీ, ఇది గర్ల్ ఫ్రెండ్ వల్ల జీవితం ఏ మేరకు ఎఫెక్ట్ అయ్యింది అనే విషయం కావడంతో కాస్త ఇంట్రస్టింగ్ గా మారింది.
అవును... జీవితంలోకి గర్ల్ ఫ్రెండ్ వచ్చిన తర్వాత వచ్చిన మార్పులు, మారిన జీవన శైలి, అలవాట్లు, ఫలితంగా జరిగిన మంచి, చెడుల గురించి ఇందులో షేర్ చేసుకుంటారన్నమాట. ఈ యాష్ ట్యాగ్ పేరే "గర్ల్ ఫ్రెండ్ ఎఫెక్ట్"! మొదట టిక్ టాక్ లో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు ట్విటర్ కూ పాకింది.
కొన్ని రోజుల క్రిందట "బాయ్ ఫ్రెండ్ ఎయిర్","బాయ్ ఫ్రెండ్ ఎఫెక్ట్" పేరిట కొద్ది రోజులు ఓ ట్రెండ్ చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. బాయ్ ఫ్రెండ్ తో ఎక్కువ సమయం గడపడం వల్ల ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి... ఫేస్ లో గ్లో, ఫిజిక్ లో ఫిట్ నెస్ ఎలా మారుతుంది అనే విషయాలు పేర్కొనడం ఆ ట్రెండ్ ఉద్దేశ్యం. ఈ క్రమంలోనే గర్ల ఫ్రెండ్ వల్ల బాయ్ ఫ్రెండ్ జీవితంలో, బాడీలో వచ్చే మార్పులను షేర్ చేసుకుంటారన్నమాట.
ఇందులో భాగంగా... గర్ల్ ఫ్రెండ్ పరిచయం అయిన తర్వాత ఆ వ్యక్తిలో ఎలాంటి మార్పులొచ్చాయి... నడతలోనూ, నడకలోనూ ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో తెలియజేయడమే ఈ ట్రెండ్ ఉద్దేశ్యం. తనకు ఒక అమ్మాయి పరిచయం కాక ముందు ఎలా ఉండేవాడు? పరిచయం తర్వాత ఎలా ఉన్నాడు? అనే విషయాలు పేర్కొంటూ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేయాలి.
అంటే గర్ల్ ఫ్రెండ్ తో రిలేషన్ షిప్ వల్ల బాయ్ ఫ్రెండ్ లో ఎలాంటి మార్పులొచ్చాయో చెప్పడమే దీని ఉద్దేశ్యం. దీంతో... లుక్, స్టైల్, బాడీ లాంగ్వేజ్, డ్రెస్సింగ్ లో వచ్చిన మార్పులను చూపిస్తూ పలువురు ఇప్పటికే పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం టిక్ టాక్ లో ఈ ట్రెండ్ 58 మిలియన్ వ్యూస్ ను దక్కించుకోవడం గమనార్హం.